37 రోజుల పోరాటం ముగిసింది. కేంద్రం తలొగ్గింది. మంత్రి రాజీనామా అయిపోయింది. ఆందోళన కారులు ఇళ్లకు చేరుకున్నారు. వాతావరణం అంతా చల్లబడిన తర్వాత.. ఆందోళన ముగిసిన మరుసటి రోజు.. ఆదివారం (జులై 26) ఉదయం సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే ఫ్రెష్ వీడియో రిలీజ్ చేశారు.
కాక్రోచ్ జనతాపార్టీ మద్ధతు దారులకు పంపిన వీడియో సందేశంలో.. యువతకు అతి పెద్ద విజయం అని పేర్కొన్నారు. నీట్ పేపర్ లీక్ పై కాక్రోచ్ ల ఆందోళన.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు కేంద్రం సీజేపీ డిమాండ్స్ అంగీకరించడంతో దీక్ష విరమించిన దీప్కే.. ఆందోళన పూర్తయిన సందర్భంగా.. ఇక ప్రశాంతంగా నిద్రపోవచ్చు.. నెక్స్ట్ ఏంటి..? అనే ఆందోళన లేకుండా అన్నట్లుగా ట్వీట్ చేశారు.
37 రోజులుగా నేను ఎదుర్కొన్న పరిస్థితులు చాలా కష్టమైనవి.. ఇది నాకే కాదు మా టీమ్ అందరికీ చాలా కష్టమైన పరిస్థితి.. అంత ఈజీ కాదు అంటూ ట్వీట్ చేశారు.
కాక్రోచ్ జనతా పార్టీకి దేశ వ్యాప్తంగా మద్ధతు పలికిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. ఘోరవైన విషప్రచారం జరుగుతున్న క్రమంలో పార్టీ వెనక నిలిచిన ప్రతి సైనికుడికి కృతజ్ఞతలు చెప్పారు. ఈ ఉద్యమం ఎంత వరకు తీసుకెళ్తారు అనే సంశయంలో కొందరు ఉంటే.. దుష్ప్రచారం చేసిన వారు మరికొందరు. అయినప్పటికీ వెంట నిలిచిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అందరి మద్ధతు లేకుంటే తాను ఇది సాధించలేనని చెప్పారు.
జంతర్ మంతర్ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా కలవలేక పోయినందుకు తనను క్షమించాలని కోరారు. నాకు టైఫాయిడ్, బాగా జ్వరం.. 101 దగ్గర జ్వరం ఉంది.. అందువల్లే ఇంటికి రావాల్సి వచ్చింది.. అంటూ ట్వీట్ చేశారు.
►ALSO READ | గువా హటి: నీట్ నిరసనల్లో అస్సాం మంత్రి కుమార్తె..కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
ఈ దేశం కోసం 37 రోజులు మీరు చేసిన కష్టానికి హాట్సాఫ్.. మీరంతా లేకుంటే నా ఒక్కడితో అయ్యేది కాదు.. అందరికీ సెల్యూట్ .. అంటూ చెప్పుకొచ్చారు. ఎంతో మంది అనుమానాలు, దుష్ప్రచారాలు పార్టీని మరింది బలోపేతం చేసినట్లు చెప్పారు.
మేము తలపెట్టిన ఆందోళనలపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన వారికీ, విమర్శలకు దిగిన వారికీ ప్రత్యేక కతజ్ఞతలు. మీరు విమర్శించకుంటే.. మీరు డౌట్ పడకుంటే.. ఇంత సుదీర్ఘ ఆందళోన చేసి ఉండే వాళ్లం కామేమో.. ఇది ఆరంభం మాత్రమే.. చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. జై హింద్.. అంటూ పోస్ట్ చేశారు.
నీట్ పేపర్ లీకేజీపై ఆగ్రహంతో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనను శనివారం (జులై 25) విరమించుకున్న విషయం తెలిసిందే. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, సీజేపీ డిమాండ్లకు కేంద్రం ఒప్పుకోవడంతో ఆందోళనలు విరమించారు.
CJP Founder @abhijeet_dipke releases a video thanking everyone who made the huge victory of the youth possible.
— Cockroach is Back (@Cockroachisback) July 26, 2026
He also thanks all critics for helping him improve, and eventually deliver on the promise of the Cockroach Janta Party’s first campaign. #ANewDay pic.twitter.com/1JQNozymLo
