సైనికుల మనోస్థైర్యాన్ని కించపరిచేలా రాహుల్ వ్యాఖ్యలు : రాజ్యవర్ధన్ సింగ్

సైనికుల మనోస్థైర్యాన్ని కించపరిచేలా రాహుల్ వ్యాఖ్యలు  : రాజ్యవర్ధన్ సింగ్

దేశంపై చైనా యద్దానికి సిద్దమవుతుంటే గాఢనిద్రలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఈ వాస్తవాన్ని అంగీకరించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇది1962 లోని నెహ్రూ నాయకత్వంలోని భారతదేశం కాదని, ఇప్పుడున్నది మోడీ హయంలోని కొత్త భారత్ అని బీజేపీ ఎంపీ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్  చెప్పుకొచ్చారు. దేశం మీద ఎవరైనా కన్నేస్తే వారికి సరైన సమాధానం వస్తుందన్నారు.

చైనాతో సామీప్యత ఉండాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారని రాజ్యవర్ధన్ సింగ్  రాథోడ్  ఆరోపించారు. రాహుల్ గాంధీ తన యాత్రలో భారత భద్రత, సరిహద్దు ప్రాంతాల గురించి ఆరోపణలు చేసి దేశంలో గందరగోళం సృష్టించి, భారత సైనికుల మనోస్థైర్యాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్నారు.  కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో చైనా అక్రమాలు అనేకం జరిగాయని రాథోడ్ ఆరోపణలు చేశారు.