వైరల్: మాస్క్ మీద ముక్కు పుడక

వైరల్: మాస్క్ మీద ముక్కు పుడక

డ్రెస్​కి మ్యాచింగ్ జువెలరీ, యాక్సెసరీస్​ వేసుకోవడం కామనే. కానీ, ఇప్పుడు మ్యాచింగ్​ మాస్క్​ కూడా ఆ జాబితాలో చేరిపోయింది. ఇంకాస్త ముందడుగేసి కొందరు బంగారు నగలతో డెకరేట్​ చేసిన మాస్క్​లు వేసుకుంటున్నారు. అచ్చం  ఈ ఫొటోలో ఉన్నామెలాగా. ప్యాండెమిక్​లో చుట్టాల ఇంట్లో పెళ్లి..మాస్క్​ లేకుంటే ఎట్లా? కానీ, మాస్క్​ పెట్టుకుంటే తన బంగారు ముక్కుపుడక కనిపించదు. దాంతో కాస్త  క్రియేటివ్​గా ఆలోచించింది ఈమె. ఇలా మాస్క్​ మీద నుంచి ముక్కుపుడక పెట్టుకుంది. ఈ ఫొటోని ఐపీఎస్​​​ ఆఫీసర్​ దిపాన్షు కాబ్రా ట్విట్టర్​లో పోస్ట్​ చేసింది.  దాంతో ఈ మహిళ ఫొటో సోషల్ మీడియాలో వైరల్​ అయ్యింది.