మేడ్చల్ టికెట్ నాదే.. కాంగ్రెస్ గెలుపు ఖాయం

మేడ్చల్ టికెట్ నాదే.. కాంగ్రెస్ గెలుపు ఖాయం

మేడిపల్లి,వెలుగు: కేసీఆర్, కేటీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా కూడా రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని పీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ తరఫున మేడ్చల్ సెగ్మెంట్ టికెట్ తనకే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.  సోమవారం మేడిపల్లిలోని తన ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్లారెడ్డి ఓ జోకర్ పాత్ర పోషిస్తున్నాడే తప్ప రాష్ట్ర మంత్రిగా వ్యవహరించడం లేదని విమర్శించారు.

 పీర్జాదిగూడ, బోడుప్పల్​లో వారానికి మూడ్రోజులు పర్యటించే మంత్రి ఈ ఐదేండ్లలో రాష్ట్ర ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా తేలేకపోయాడని మండిపడ్డారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలు చేశాడని వజ్రేశ్ యాదవ్ ఆరోపించారు. మేడ్చల్ సెగ్మెంట్ లో మంత్రి మల్లారెడ్డిపై పోటీ చేసి లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తానని వజ్రేశ్ యాదవ్ తెలిపారు. ఈసారి మేడ్చల్ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తారని ఆయన ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.