ఢిల్లీలో మహంకాళి బోనాల ఉత్సవాలు..మూడు రోజుల పాటు వేడుకలు

ఢిల్లీలో మహంకాళి బోనాల ఉత్సవాలు..మూడు రోజుల పాటు వేడుకలు

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలో లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 20, 21, 22 తేదీల్లో ఢిల్లీ తెలంగాణ భవన్ లో ఆలయ కమిటీ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తోంది. తొలిరోజు బోనాల ఫొటో ఎగ్జిబిషన్‌‌‌‌తో ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, భవన్ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ ఉత్సవాలను ప్రారంభించారు.

అనంతరం ఉత్సవ కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఈసారి 12వ వార్షిక ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర సిద్ధించిన తర్వాత యేటా...  సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ తెలంగాణ సంస్కృతిని దేశ రాజధానిలో చాటిచెబుతున్నామన్నారు.