
- అమెరికాలోని అలస్కాలో ఘటన
జెనీవా: అమెరికాలోని ఆగ్నేయ అలస్కాలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. జునాయు క్యాపిటల్సిటికీ దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో కొండప్రాంతానికి సమీపంలో రాంగేల్అనే గ్రామం ఉన్నది. ఇక్కడ 2 వేల మంది జనాభా కలిగిన మత్స్యకారుల కమ్యూనిటీ నివాసం ఉంటోంది.
సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో భారీ వర్షం, గాలులతో కూడిన తుఫాన్ సంభవించింది. దీంతో కొండచరియలు విరిగిపడ్డాయి.. ఒక బాలిక సహా ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు కూడా కనిపించకపోవడంతో రెస్క్యూ టీమ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది.