ఫెరారీ కారును కొట్టేసే ప్రయత్నం… ముగ్గురు కిలాడీలు అరెస్టు

ఫెరారీ కారును కొట్టేసే ప్రయత్నం… ముగ్గురు కిలాడీలు అరెస్టు

హైద‌రాబాద్ : రెండు కోట్ల విలువైన కారును కొట్టేసేందుకు ప్ర‌య‌త్నించిన ముగ్గురు కిలాడీల‌ని నార్త్ జోన్ కార్ఖానా పోలీసులు అరెస్ట్ చేశారు. కార్ఖాన సిఐ మధుకర్ స్వామి తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… మహేంద్రాహిల్స్ కు చెందిన దినేష్ గాంధీ అనే వ్యక్తి కేరళకు చెందిన జెస్సిక్ అనే వ్యక్తి వద్ద రెండు కోట్ల విలువైన ఫెరారీ కార్(DL12 CJ 1111) ను కొనుగోలు చేశారు. కారు ను కొనుగోలు చేసిన దినేష్ గాంధీ తన పేరు మీద‌ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రంగారెడ్డి జిల్లాకు చెందిన నీరజ్ శర్మ అనే బ్రోకర్ ను సంప్రదించాడు. అతను పనిమీద విదేశాలకు వెళుతున్నానని చెప్పి, రిజిస్ట్రేషన్   బాధ్య‌త‌ను ఢిల్లీలో ఉన్న ప్రిన్స్ పాఠక్ అనే ఆర్టీఏ బ్రోకర్ అప్పగించాడు.

ఆ కారు  సికింద్రాబాద్..కార్ఖాన పి.ఎన్. టి కాలనీలో నివాసం ఉండే దినేష్ గాంధీ ప్రెండ్ వద్ద ఉన్నట్లు తెలుసుకొన్న ఆ బ్రోక‌ర్… అత‌ని వ‌ద్ద‌కు వెళ్లి మీ ఫ్రెండ్ దినేష్ గాంధీ పంపారని,మీ వద్ద ఉన్న ఫెరారీ కార్ రిపేర్ ఉందని,దినేష్ కారు  తీసుకెళ్లామన్నారని చెప్పారు. అది నిజ‌మేన‌ని న‌మ్మిన దినేష్ గాంధీ ఫ్రెండ్.. త‌న‌ వద్దకు వచ్చిన నీరజ్ శర్మ, భూపేందర్, సద్దాం లకు కారు  ను అప్పగించాడు. ఈ విష‌యం దినేష్ కు చెప్పడంతో..అనుమానం వచ్చిన దినేష్ గాంధీ వెంట‌నే కార్ఖాన పోలీసులకు పిర్యాదు చేశాడు. అత‌ని ఫిర్యాదు మేర‌కు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే సీసీ కెమెరాల ఆధారంగా సర్చ్ ఆఫరేషన్ చేశారు. టోలీచౌక్ వద్ద కార్ ను ఎత్తుకెళ్తున్న ఢిల్లీకి చెందిన‌ నీరజ్ శర్మ..భూపేందర్..సద్దాం అనే కేటుగాళ్లను అరెస్టు చేసి, రిమాండ్ కు తరత‌ర‌లించారు. కాగా వారంతా క‌లసి నకిలీ పేపర్స్ సృష్టించి ఆ కారు ను ఢిల్లీకి చెందిన బిలాల్ అనే వ్యక్తికి అమ్మినట్లు సిఐ తెలిపారు.