
హైదరాబాద్ పహాడీ షరీఫ్ ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఢీకొన్న ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం ( అక్టోబర్ 1 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హర్షగూడ రోడ్డు దగ్గర జరిగింది ఈ ఘటన.
రెండు బైకులు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందగా.. తీవ్రంగా గాయపడ్డ మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు పోలీసులు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.