బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్‌, ముగ్గురు మృతి

బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్‌, ముగ్గురు మృతి

నల్లగొండ జిల్లాలోని చిట్యాలలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వెళ్తున్న RTC సూపర్ లగ్జరీ బస్సు, టీవీఎస్ మోపెడ్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. స్థానిక రైల్వే స్టేషన్ దగ్గర యూ టర్న్ తీసుకోబోతున్న మోపెడ్ ను ఆర్టీసీ బస్సు వెనకనుంచి ఢీ కొట్టింది. చిట్యాల శివార్లలో జరిగే మ్యారేజ్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో చౌటుప్పల్ మండలం దండు మల్కాపురానికి చెందిన బిక్షపతి, చెన్నారెడ్డి గూడెంకు చెందిన నరసింహ, మరో వ్యక్తి  సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్సు అతివేగం కారణంగానే ఈ  ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు.