టైరు పేలి.. అదుపుతప్పి లారీని ఢీకొన్న కారు

V6 Velugu Posted on Sep 04, 2021

  • కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి

కర్నూలు: ప్యాపిలి మండలం జాతీయ రహదారి-44పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి. చెందారు. ప్యాపిలి సమీపంలో కలుచట్ల గ్రామ బ్రిడ్జి వద్ద శనివారం జరిగిందీ ప్రమాదం. ఈ ప్రమాదంలో కర్నూలు జిల్లా ఆత్మకూర్ నియోజకవర్గం ఒక ఛానెల్ విలేకరి సుధాకర్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ టూరిజం డైరెక్టర్, నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్ధర్ అనుచరుడు శ్రీనివాస్ రెడ్డి తోపాటు మరో వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం. ఇన్నోవా కారులో బెంగళూరు వెళ్లిన వీరు బెంగుళూర్ నుండి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సి.ఐ రామలింగయ్య, ఎస్.ఐ రాకేష్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృత దేహాలను డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 
 

Tagged Amaravati, Kurnool District, Srinivas Reddy, ap today, , peapily mandal, pyapili mandal, kaluchatla village, nh 44 accident, accident on nh 44, sudhakr gowd

Latest Videos

Subscribe Now

More News