
- సుప్రీంకోర్టు జడ్జిలుగా ముగ్గురు ప్రమాణం
- 34కు పెరిగిన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు జడ్జిలుగా కొత్తగా ముగ్గురు ప్రమాణ స్వీకారం చేశారు. మూడు హైకోర్టులకు చీఫ్ జస్టిస్‌లుగా పనిచేసిన జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్, జస్టిస్ సందీప్ మెహతలచే గురువారం చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు కాంప్లెక్స్‌లో జరిగిన ఈ ప్రమాణ కార్యక్రమానికి పలువురు జడ్జిలు, లాయర్లు, జడ్జిల కుటుంబసభ్యులు హాజరయ్యారు.
ఈ ముగ్గురితో కలిపి సుప్రీంకోర్టు జడ్జిల మొత్తం సంఖ్య 34కు పెరిగింది. ఇంతకుముందు సతీశ్‌చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అగస్టీన్ జార్జ్ మాసిహ్, గౌహతి హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా సందీప్ మెహతా పనిచేశారు. వీరి నియామకాన్ని లా మినిస్టర్ అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ట్విట్టర్‌లో వెల్లడించారు. కాగా, నవంబర్ 6న సుప్రీంకోర్టు కొలీజియం వీరి ముగ్గురి పేర్లను సిఫార్సు చేసింది.