ఒకరు చోరీ చేస్తే.. ముగ్గురు అమ్మిపెడ్తరు

ఒకరు చోరీ చేస్తే.. ముగ్గురు అమ్మిపెడ్తరు

ఎల్​బీనగర్, వెలుగు: ఆన్ లైన్ గేమ్ లు, ఈజీగా డబ్బులు సంపాదించాలని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యుడితో పాటు మేడ్చల్ కు చెందిన ముగ్గురిని కీసర పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద రూ.50 లక్షల విలువైన 680 గ్రాముల బంగారు ఆభరణాలు,2.4కేజీల వెండి వస్తువులు ల్యాప్ టాప్, సెల్ ఫోన్లు,  బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఎల్​బీ నగర్ లోని సీపీ క్యాంప్ ఆఫీసులో మీడియా సమావేశంలో  రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ వివరాలు వెల్లడించారు. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా నంగునేరికి చెందిన రామకృష్ణన్(35) పాత నేరస్తుడు.  కొంతకాలం కిందట సిటీకి వచ్చి జవహర్ నగర్ లో మిల్లెట్స్ వ్యాపారం ప్రారంభించాడు.

అదే ప్రాంతంలోని దేవేంద్రనగర్ కాలనీ చెందిన కాగ్ గోవింద్(36)కు స్థానికంగా ఫుడ్ స్టాల్ ఉంది. రామకృష్ణన్ తరుచుగా అతడి స్టాల్ వద్దకు వస్తుండగా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలసి ఆన్ లైన్ గేమ్స్ ఆడేవారు. చెడు వ్యసనాలను బానిసలు అయ్యారు. దీంతో అప్పుల పాలై.. డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీలకు ప్లాన్ చేశారు. రామకృష్ణన్ చోరీ చేస్తారని, సొత్తును ఇతర ప్రాంతాల్లో  అమ్మాలని గోవింద్ కు కీసర, కుషాయిగూడ, జవహర్ నగర్ పరిధిలో రామకృష్ణన్​కు  పట్టుంది. దీంతో అదే ప్రాంతానికి చెందిన మహేందర్ పవార్(36), బాలాజీ నగర్ కు చెందిన బైక్ మెకానిక్ బచ్చు సంతోష్ (40) స్థానికంగా జ్యువెలర్ వర్క్ షాపు ఉంది. వీరంతా ముఠాగా ఏర్పడ్డారు. 

రామకృష్ణన్ చోరీ చేసిన ఆభరణాలను గోవింద్ కు ఇస్తాడు. అతను మహేందర్ పవార్, సంతోష్ కు లకు ఇచ్చి ఇతర ప్రాంతాల్లో అమ్మకాలు చేసి వచ్చాక  డబ్బులు అందరూ పంచుకుంటారు. రామకృష్ణన్ రాత్రిపూట బైక్ పై మంకీ క్యాప్, మాస్కు ధరించి తెల్లవారుజామున కాలనీలో తిరుగుతూ రెక్కీ నిర్వహిస్తాడు. తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతుంటాడు. మహేందర్ పవార్ బంధువు ఇంట్లో జరిగిన ఫంక్షన్ వెళ్లాడు. అతను రామకృష్ణన్ కు సమాచారం ఇచ్చాడు. దీంతో రామకృష్ణన్ ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకుని, అతని ఇంటికి వెళ్లి లాకర్ లోని 32తులాల బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లాడు.