జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో మూడంచెల భద్రత

జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో మూడంచెల భద్రత

శ్రీనగర్‌‌‌‌‌‌‌‌: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మంగళవారం జరిగే వేడుకలకు మూడంచెల భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌, డ్రోన్ల ద్వారా నిఘా పెట్టారు. గతంలో మాదిరిగా జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో ఇంటర్నెట్‌‌‌‌ సేవలపై ఎలాంటి నిషేధం ఉండబోదని సోమవారం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా వేడుకలు జరిగే సిటీ సెంటర్‌‌‌‌‌‌‌‌ లాల్‌‌‌‌ చౌక్‌‌‌‌, భక్షి స్టేడియం వద్ద ఎస్‌‌‌‌వోజీ బలగాలతో పాటు జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారన్నారు. గతంలో లాగా ఆయా ప్రాంతాల్లో ఎలాంటి బారికేడ్లను పెట్టబోమని, అయితే, వాహనాల తనిఖీలు ఉంటాయని వెల్లడించారు. ‘‘జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేశాం. ఈ ఏడాది మరిన్ని ఈవెంట్లు ప్లాన్‌‌‌‌ చేసినందున మూడంచెల సెక్యూరిటీ కల్పించాం. డ్రోన్స్‌‌‌‌, హెలికాప్టర్స్ ద్వారా నిఘా ఉంచాం. 2019కు ముందు కాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా సెక్యూరిటీ కారణాలతో ఇంటర్నెట్‌‌‌‌ సేవలు నిలిచిపోయేవి. ఈసారి ఇంటర్నెట్​పై ఎలాంటి ఆంక్షలు లేవు”అని కాశ్మీర్‌‌‌‌‌‌‌‌ అడిషినల్‌‌‌‌ డీజీపీ విజయ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. 

సరిహద్దుల్లో మేం ఉన్నాం.. భయం వద్దు.. 

దేశ సరిహద్దును కాపాడేందుకు తామంతా ఉన్నామని, మీరు ఎలాంటి ఆందోళన చెందకుండా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవాలని దేశ ప్రజలకు ఓ బీఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ జవాన్‌‌‌‌ మెసేజ్‌‌‌‌ పంపాడు. జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి గస్తీ కాస్తున్న కానిస్టేబుల్‌‌‌‌ సంజీవ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ రాయ్‌‌‌‌ మాట్లాడుతూ, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంలో విధ్వంసం సృష్టించేందుకు శత్రువులు ప్లాన్‌‌‌‌ చేస్తున్నందున్న సరిహద్దు వద్దనున్న బీఎస్‌‌‌‌ఎఫ్ జవాన్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. హైకమాండ్‌‌‌‌ ఆదేశాల మేరకు సరిహద్దు వెంబడి పెట్రోలింగ్‌‌‌‌, నిఘాను పెంచామని చెప్పారు. సాధారణ సరిహద్దులతో పోలిస్తే నియంత్రణ రేఖ వద్ద ప్రమాదాలు 
ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు.