పోచమ్మ ఆలయంపై దుండగుల దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు

పోచమ్మ ఆలయంపై దుండగుల దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ మండలం జూకల్​లోని పోచమ్మ ఆలయంపై గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి దాడిచేశారు. అమ్మవారి విగ్రహంపై ఉన్న వస్త్రాలను తీసి బయటపడేశారు. విగ్రహం కండ్లను ధ్వంసం చేశారు. గమనించిన స్థానికులు ఓ దుండగుడిని పట్టుకొని చితకబాదారు.

పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్​కు తరలిస్తుండగా, గ్రామస్తులు పోలీస్ వెహికల్ ను చుట్టుముట్టారు. పోలీసులు అదనపు బలగాలను పిలిపించి పరిస్థితిని కంట్రోల్​ చేశారు. పారిపోయిన దుండగుల కోసం  గాలిస్తున్నారు. నిందితులను బిహార్​కు చెందిన వారుగా అనుమానిస్తున్నారు.