ప్రయాణికుడిని చితక్కొట్టిన రైల్వే టీటీఈ..ఆ తరువాత ఏం జరిగిందంటే..

ప్రయాణికుడిని చితక్కొట్టిన రైల్వే టీటీఈ..ఆ తరువాత ఏం జరిగిందంటే..

ఓ యువకుడిని రైల్వే టీటీఈ ఘోరంగా కొట్టారు. ఆ ప్రయాణికుడిపై దుర్భాషలాడారు. బరౌనీ-లక్నో ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. టీటీఈని కఠినంగా శిక్షించాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి టికెట్ తీసుకోలేదని అతి దారుణంగా కొట్టాడు రైల్వే టీటీఈ. ఈ ఘటన బరౌనీ-లక్నో ఎక్స్‌ప్రెస్ లో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. టికెట్ తీసుకోలేని పాపానికి మరీ ఇంత దారుణంగా ఎవరైనా కొడతారా.. టికెట్ లేకుంటే ఫైన్ వేయాలి...ఫైన్​ చెల్లించకపోతే రైల్వే పోలీసులకు అప్పగించాలి.  కానీ, చేయి ఉంది కదా అని ఎలా పడితే అలా కొట్టేయడమేనా..?. ఇదిలా ఉంటే.. ఆ వ్యక్తిని అంత దారుణంగా కొడుతుంటే పక్కన ఉన్న ప్రయాణికులు కూడా ఏంటని ప్రశ్నించారు. వారిపై సైతం దురుసుగా ప్రవర్తించాడు టీటీఈ.  రైలులో  ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు ఈ ఘటనను వీడియో తీసి  సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో షేర్ చేశాడు.

ఈ వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ట్యాగ్ చేశాడు. వీళ్లకు ఇలా కొట్టే స్వేచ్ఛ ఉందా అని ప్రశ్నించాడు. టీటీఈ పేరుతో గూండాలా ప్రవర్తిస్తారా అని అన్నాడు. ఇతను వ్యవస్థలో ఎందుకు ఉన్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.

వీడియోను పరిశీలిస్తే… ప్రయాణికుడిని టీటీఈ లేచి నిలబడమని అడుగుతూ పదే పదే చెంపదెబ్బలు కొట్టాడు. ఆ యువకుడినిపైకి లేపుతూ అతడి దుస్తులు పట్టుకుని బలవంతంగా లాగాడు. . ఆ యువకుడి టికెట్ విషయంలోనే టీటీఈ ఇలా రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. ఎందుకు కొడుతున్నారంటూ తోటి ప్రయాణికులు కూడా అడిగారు. ఈ పోస్ట్ ను చూసిన నార్త్ ఈస్టర్న్ రైల్వే.. వీడియోను చూసిన తర్వాత విషయాన్ని గ్రహించి టీటీఈని తక్షణమే సస్పెండ్ చేశారు.