‘జై తెలంగాణ’ నినాదంతోఊపిరి వదిలి..

‘జై తెలంగాణ’ నినాదంతోఊపిరి వదిలి..

బలిదానాలను ఒక నిరసన రూపంగా ఎంచుకున్న సందర్భాలు ప్రపంచంలో అతి తక్కువ. కొరియాలో, ఐర్లాండులో, క్యూబాలో మనం అటువంటి ఘటనలను చూస్తాం. కానీ తెలంగాణలో వందల సంఖ్యలో బలిదానాలు జరిగాయి. తెలంగాణ కోసం తిరిగి రాలేని లోకాలకు వెళ్లిపోయారు. ప్రాణం పోయే ముందు వారంతా ‘జై తెలంగాణ’ అన్నరు తప్ప తమ తల్లులను కూడా తలుచుకోలేదు. ఇంతటి త్యాగనిరతి ప్రపంచంలో ఎక్కడా చూడం. ఇవన్నీ ఉద్యమానికి ఉన్న ప్రత్యేకతలు. వీటిని మర్చిపోతే తెలంగాణ ఉద్యమం గొప్పతనాన్ని గుర్తించలేం.