ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ పుష్ప ది రూల్(Pushpa The Rule). క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. పుష్ప 2 సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. ఆల్రెడీ సెకండ్ పార్ట్ గ్లింప్స్, పోస్టర్ రిలీజ్ అయ్యి అంచనాలు అమాంతం పెంచేశాయి.
రీసెంట్గా పుష్ప 2 టీజర్ అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ గా (ఏప్రిల్ 8న) వస్తుందని మేకర్స్ తెలిపిన విషయం తెలిసిందే. కానీ,ఏ టైంకి వస్తుందో మాత్రం వెల్లడించలేదు. ఇప్పటికే పుష్ప 2 టీజర్ అప్డేట్ కోసమే కళ్ళు కాయలు కాసేగా ఫ్యాన్స్ ఎదురుచూశారు.ఇక టైం కోసం కూడా రిస్క్ పడకూడదని ఫ్యాన్స్ కు టీజర్ టైం అనౌన్స్ చేశారు మేకర్స్." ఏప్రిల్ 8న ఉదయం 11.07 గంటలకు పుష్పరాజ్ వస్తాడని వెల్లడించారు. దీంతో పుష్ప 2 టీజర్ కోసం ఫ్యాన్స్ గంటలను లెక్కేసుకుంటున్నారు.
𝐓𝐎𝐌𝐎𝐑𝐑𝐎𝐖 is the day ❤️🔥
— Mythri Movie Makers (@MythriOfficial) April 7, 2024
𝟏𝟏.𝟎𝟕 𝐀𝐌 is the time ❤️🔥#Pushpa2TheRuleTeaser will mark the entry of #PushpaRaj that will create ripples across the box office💥💥
𝗚𝗢𝗢𝗦𝗘𝗕𝗨𝗠𝗣𝗦 𝗚𝗨𝗔𝗥𝗔𝗡𝗧𝗘𝗘𝗗 🔥#PushpaMassJaathara #Pushpa2TheRule
ఇదిలా ఉంటే బన్నీ తన ఇంస్టాగ్రామ్ లో..అంతా సిద్ధం అయిపోయింది..అంటూ స్క్రీన్ పైన పుష్ప 2 టైటిల్ ఉన్న ఫోటోని షేర్ చేశారు. దీంతో.. పుష్ప 2 టీజర్ పై మరింత ఆసక్తి పెరిగింది. ఇక అల్లు అర్జున్ చేసిన ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్ట్ చూసిన బన్నీ ఫ్యాన్స్..అన్నా..టీజర్ అదిరిపోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య విడుదల కానున్న టీజర్ నెట్టింట ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.