Ram Charan: నీ విజయాన్ని చూసి గర్వంగా ఉంది.. సిద్దుపై రామ్ చరణ్ ప్రశంసలు

Ram Charan: నీ విజయాన్ని చూసి గర్వంగా ఉంది.. సిద్దుపై రామ్ చరణ్ ప్రశంసలు

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda)పై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల టిల్లు స్క్వైర్(Tillu Squire) సినిమా చూసిన ఆయన మూవీ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..  హీరో సిద్దు జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ జంటగా వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ టిల్లు స్క్వైర్. 

అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సాధించింది. డీజీ టిల్లు సినిమాకు సీక్వెల్ గా రావడంతో ఈ సినిమాపై కూడా అదే రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా కూడా ఉండటంతో ఆడియన్స్ ఈ సినిమా చూసేందుకు ఎగబడ్డారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది ఈ సినిమా. మొదటిరోజే రూ.25 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ఈ సినిమా.. కేవలం పదిరోజులోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 

ఇక ఈ సినిమా సాధించిన విజయానికి సినీ ప్రముఖులు సైతం యూనిట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా చూసి టీమ్ ను అభినందించగా.. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా టిల్లు స్క్వైర్ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు సోషల్ మీడియాలో స్పందిస్తూ.. డియర్ సిద్ధూ.. నీ విజయాన్ని చూసి చాలా గర్వంగా ఉంది. ఇంత గొప్ప సక్సెస్ అందుకున్నందుకు దర్శకుడు మల్లిక్ రామ్, హీరోయిన్ అనుపమ, మ్యూజిక్ డైరెక్టర్స్, సితార ఎంటర్టైన్మంట్స్.. టీం మొత్తానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.. అంటూ తెలిపారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.