పద్మారావునగర్, వెలుగు: తిరుమలగిరి చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ పోలీసులు సకాలంలో స్పందించి బాధితుడిని రక్షించారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో రెండు మినీ ట్రక్కులు ఢీకొనడంతో ఓ డ్రైవర్ వాహనంలో ఇరుక్కుపోయాడు. విషయం తెలిసిన వెంటనే ట్రాఫిక్ ఏసీపీ జి. శంకర్‌రాజు సిబ్బంది గణపతి, కనకయ్యలతో కలిసి ఘటనాస్థలికి చేరుకుని డ్రైవర్‌ను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.
