స్మార్ట్​ వాచీలు తీసుకొస్తున్న టైటాన్

స్మార్ట్​ వాచీలు తీసుకొస్తున్న టైటాన్

బ్రాండెడ్ వాచ్​లకు పేరొందిన  టైటాన్​ కంపెనీ  ‘టైటాన్​ స్మార్ట్​ ప్రో’ స్మార్ట్​ వాచీలు తీసుకొస్తోంది. ఈ వాచీలో హెల్త్, ఫిట్​నెస్​కి సంబంధించిన ఫీచర్లు ఎక్కువ. ఈ వాచీ డిస్​ప్లే 390x390 రెజల్యూషన్. ఇందులో ఇన్​ బిల్ట్​ జిపిఎస్ ఉంటుంది. అంతేకాదు బాడీ టెంపరేచర్, హార్ట్​రేట్, బ్లడ్​ ఆక్సిజన్​ శాచ్యురేషన్, స్లీప్, స్ట్రెస్​ మానిటర్​గాను పనిచేస్తుంది. ఇందులో ర్యాపిడ్​ ఐ మూమెంట్​ ట్రాకింగ్​ ఫీచర్​ కూడా ఉంది. బారోమీటర్, అల్టీమీటర్, కంపాస్​ ఫీచర్లు ఉన్నాయి. ఆక్సిజన్​ లెవల్స్​​ని లెక్కిస్తుంది కూడా. ఇందులో పీరి యడ్​ ట్రాకర్​ కూడా ఉంది. ఇవే కాకుండా... నోటిఫికేషన్​ అలర్ట్స్, మ్యూజిక్​ కంట్రోల్, కెమెరా కంట్రోల్​తో పాటు వాతావరణ మార్పుల్ని సూచించే ఫీచర్లు  కూడా ఉన్నాయి ఇందులో. 
ఈ స్మార్ట్ వాచ్​ టైటాన్​ స్మార్ట్ ప్రో యాప్​కి కనెక్ట్ అయి ఉంటుంది. ఒకసారి ఛార్జింగ్​ చేస్తే రెండు వారాలు పనిచేస్తుంది. నలుపు, ఆకుపచ్చ, గులాబీ, ఎరుపు, నీలం... ఇలా ఐదు రంగుల్లో దొరుకుతున్నాయి. హెల్త్, ఫిట్​నెస్​ మీద ఫోకస్​ పెట్టిన వాళ్లకు ఈ స్మార్ట్​ వాచీ చాలా ఉపయోగపడుతుంది. ఆన్​లైన్​లో ఈ వాచీలు రూ. 11,995 ల నుంచి దొరుకుతున్నాయి.