జుట్టు పొడవుగా , ఒత్తుగా పెరగాలంటే..

జుట్టు పొడవుగా , ఒత్తుగా పెరగాలంటే..

జుట్టు పొడవుగా , ఒత్తుగా పెరగాలంటే.. సరైన  కేర్​ తీసుకోవాలి. దాంతో పాటు  కొన్ని పొరపాట్లకి దూరంగా ఉండాలి.

  •  జుట్టుకి వేడి తగిలితే..కుదుళ్లు బలహీనమవుతాయి. అందుకని బ్లో డ్రయర్లు, స్ట్రయిట్​నర్స్​ వాడుతుంటే కనుక టెంపరేచర్​ 185 డిగ్రీలు మించకూడదు. 
  • మాడు మీద బాగా మసిలిన నీళ్లు పడితే  నూనె గ్రంథులు దెబ్బతిని జుట్టు రఫ్​గా​ అవుతుంది. అంతేకాదు వేడినీళ్ల వల్ల జుట్టు​ కూడా చిట్లిపోతుంది. అందుకని గోరువెచ్చని నీళ్లతోనే తలస్నానం చేయాలి. 
  • ఎప్పటికప్పుడు స్టయిలింగ్​ టూల్స్​ శుభ్రం చేయాలి. హెయిర్​ పిన్స్​, దువ్వెనల్ని  వారానికోసారి షాంపూ కలిపిన  వేడినీళ్లలో నానబెట్టి,  కడగాలి. 
  • టైట్​గా ఉండే ​ హెయిర్​ బ్యాండ్స్​ పెట్టుకుంటే జుట్టు ఊడిపోతుంది. అందుకే ఆ అలవాటుని వెంటనే మానేయాలి. 
  • రాత్రి పడుకునే ముందు జుట్టుని తప్పనిసరిగా అల్లుకోవాలి.  
  • జుట్టు పెరుగుదల మాడు నుంచే మొదలవుతుంది. అందుకని జుట్టు, కుదుళ్లు, మాడుకి నూనె బాగా పట్టించి మసాజ్​ చేయాలి. 
  • జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వకూడదు. ఒక వేళ అలాగే పదేపదే తలదువ్వుతుంటే  జుట్టు రాలిపోతుంది. చిట్లిపోతుంది.