ఓపెనింగ్​కి షేక్ పేట్​, ఒవైసీ ఫ్లై ఓవర్లు రెడీ

ఓపెనింగ్​కి షేక్ పేట్​, ఒవైసీ ఫ్లై ఓవర్లు రెడీ

హైదరాబాద్​, వెలుగు: సిటీలో చేపట్టిన షేక్​పేట్, ఒవైసీ జంక్షన్​  ఫ్లై ఓవర్​ పనులు పూర్తయ్యాయి. వాటిని ఈ నెలాఖరులో ప్రారంభించాల్సి ఉండగా.. అందుకు మంత్రి కేటీఆర్​ అపాయింట్​మెంట్​ కోసం అధికారులు వెయిట్​ చేస్తున్నట్టు తెలుస్తుంది. రూ. 333.55 కోట్ల  అంచనాతో షేక్​పేట్​ ఫ్లై ఓవర్​ పనులను 2018లో ప్రారంభించారు. 6 లేన్లతో 2.8 కి.మీ  ఉన్న ఈ ఫ్లై ఓవర్​ అందుబాటులోకి వస్తే  రేతిబౌలి నుంచి గచ్చిబౌలి మధ్యలో ట్రాఫిక్​ తగ్గుతుంది. 3 లేన్ల ఓవైసీ ఫ్లై ఓవర్​ పనులను రూ. 63 కోట్ల అంచనాతో 2018లోనే ప్రారంభించారు. 1.4 కి.మీ మిథాని జంక్షన్ నుంచి ఒవైసీ ఆస్పత్రి జంక్షన్ వరకు ఉన్న  ఈ ఫ్లైవర్ అందుబాటులోకి వస్తే  కర్మన్ ఘాట్, సంతోశ్​నగర్, మిథాని, చాంద్రాయణ గుట్ట రూట్లలో ట్రాఫిక్​  తగ్గనుంది