నేడు సారు జయంతి: తెలంగాణ జాతిపిత యాదిలో..!

నేడు సారు జయంతి: తెలంగాణ జాతిపిత యాదిలో..!

ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమంలో ఆది నుంచి ఆయనది అలుపెరగని పోరాటం. ‘జై తెలంగాణ’ అని ఎవరు నినదించినా, ఎవరు జైకొట్టినా.. వారికి పబ్బతి పట్టి , సమ్మతి తెలిపి, ఇమ్మతి ఇచ్చిన ఇమాందార్ ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్. ఆయనకు పార్టీలు లేవు.. ప్రత్యేక జెండాలు లేవు.. ప్రత్యేక ఎజెండాలు లేవు..ధ్యాసంతా తెలంగాణే.. శ్వాసంతా తెలంగాణే. తొలిదశ ఉద్యమం నుంచి మలిదశ ఉద్యమం వరకు అక్షర సైనికుడిగా, సిద్ధాంతకర్తగా సారు ప్రస్థానం.. గడప గడపను కదిలించింది. ఊరూరా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను రగిలించింది. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ ప్రకటన వచ్చేలా చేసింది. సారు కన్న కల సాకారమై సగర్వంగా తెలంగాణ తల్లి ప్రత్యేక రాష్ట్ర మై నిలిచింది. జయశంకర్ సారు మన కండ్ల ముందు లేకపోయినా.. నాలుగుకోట్ల ప్రజల గుండెల్లో ‘తెలంగాణ జాతిపిత’గా చిరస్థాయిగా నిలిచే ఉంటారు. నేడు సారు జయంతి సంద‌ర్భంగా ఘ‌న నివాళి.

మ‌రిన్ని వార్త‌ల కోసం