Viral Video: ప్రియురాలి పెళ్లికి వచ్చిన ప్రియుడు ...పెళ్లికొడుకుకు బలే గిఫ్ట్​ ఇచ్చాడు...

Viral Video: ప్రియురాలి పెళ్లికి వచ్చిన ప్రియుడు ...పెళ్లికొడుకుకు బలే గిఫ్ట్​ ఇచ్చాడు...

అనుకున్నవి అన్నీ జరగవు.. జరిగేవి జరగక మానవు .. ఎప్పుడు ఎవరికి ఏది రాసి పెట్టి ఉందో అది జరిగి తీరుతుంది. ప్రియురాలి పెళ్లికి వచ్చిన ప్రియుడు పెళ్లికొడుకు బలే గిఫ్ట్​ ఇచ్చాడు.  పాపం తనకు కావలసిన భార్యను మరొకరు పెళ్లి చేసుకుంటే హర్ట్​ అయ్యాడు.. ఇక అంతే ఆవేశంతో ఊగిపోయి... పెళ్లి వేదికపైనే నవ వరుడిని  భార్య ప్రియుడు చితక్కొట్టాడు.  ఈ ఘటన రాజస్థాన్​ లో జరిగింది.  వివరాల్లోకి వెళ్తే ...

వారిద్దరు ప్రేమించుకున్నారు.. పెళ్లి పీటలు ఎక్కాలనుకున్నారు.  అయితే ప్రియురాలు మాత్రం పెళ్లి పీటలెక్కింది... కాని అతని ప్లేస్​లోమరొకరు వచ్చారు.   ప్రేమించుకున్న వాళ్లంతా పెళ్లి పీటలు ఎక్కాలని లేదు. వివిధ కారణాలతో చాలామంది మధ్యలోనే విడిపోతున్నారు. కొందరు పరిస్థితుల ప్రభావంతో బ్రేకప్ చెప్పుకుంటారు. అయితే ప్రేమించిన వారికి ఇతరులతో పెళ్లి జరిగితే, అవతలి వ్యక్తి బాధ వర్ణించలేం. ఈ పరిస్థితిని ఒక్కొక్కరు ఒక్కోలా డీల్‌ చేస్తారు. 

 రాజస్థాన్‌లో ఓ వ్యక్తి మాత్రం, తన ప్రియురాలు  వేరొకరిని పెళ్లి చేసుకోవడం చూసి హర్ట్ అయ్యాడు. దీంతో పెళ్లి వేదికపైనే వరుడిపై దాడిచేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వెంటనే చాలా మంది నెటిజన్లకు షాహిద్ కపూర్ హిట్ మూవీ  కబీర్ సింగ్  గుర్తుకు వచ్చింది. ఇది తెలుగు  అర్జున్ రెడ్డి  రీమేక్ ఫిలిం. ఈ వీడియోలో పెళ్లి కూతురి ప్రియుడు...పెళ్లి కొడుకుని అదే నండి  తన లవర్​ భర్తను  పదే పదే కొట్టడం కనిపించింది. ఈ సంఘటన రాజస్థాన్‌లోని భిల్వారాలో జరిగింది

అయితే ఈ  దాడి జరుగుతుందని ముందు ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే నవదంపతులతో ఫొటో దిగేందుకు వధువు  ప్రియుడు వేదికపైకి వెళ్లాడు. ఇక అంతే ఆవేశంతో ఊగిపోయి  వరుడిపై దాడి చేశాడు. దీంతో అక్కడ ఉన్నవారు షాక్ అయ్యారు. ఈ ఘటన ఎప్పుడు జరిగింది అనే విషయంలో  స్పష్టత లేదు. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో  ఘర్ కే కలేష్  ఖాతాలో పోస్టు చేశారు.  రాజస్థాన్‌లోని భిల్వారాలో వివాహ వేదికపై మాజీ ప్రియుడు, వరుడి మధ్య  కబీర్ సింగ్ సినిమా లాంటి ఫైటింగ్ జరిగింది. మాజీ ప్రియుడు, వధువు ఇద్దరూ ఒకే పాఠశాలలో ఉపాధ్యాయులు..  అని వీడియో క్యాప్షన్‌లో పేర్కొన్నారు.

ఈ వీడియో వైరల్​ అవడంతో నెటిజన్లు స్పందించారు. పెళ్లికి అతిథులను ఆహ్వానించేటప్పుడు ఇరువైపుల వారు గెస్ట్​ లిస్ట్​ చెక్​ చేసుకోవడం మంచిదని ఒకరు కామెంట్​చేశారు.. మరొకరు ఇది అబ్బాయి తప్పు అని అందరు అంటారు..కాని ఆ అమ్మాయి డబుల్​ గేమ్​ ఆడుంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.  ఇక మూడో యూజర్​ ... ఆ వరుడు చేసిన తప్పేంటి.. అతనికి ఏమైంది.. కబీర్​ సింగ్​ గా వ్యవహరించిన ఆ వ్యక్తికి దండా వాలా ట్రీట్​ మెంట్​ ఇవ్వాలని రాశారు.  నాలుగో వ్యక్తి  వధువును తప్పుపడుతూ ఇది  క్రైమ్​ పెట్రోలింగ్​ ఎపిసోడ్​ అంటూ.. నేరానికి సూత్రధారి వధువు అవుతుందని కామెంట్​ చేశారు.