రైతులకు అగ్రికల్చర్ వర్సిటీ విత్తనాలు

రైతులకు అగ్రికల్చర్ వర్సిటీ విత్తనాలు
  •     12 వేల క్వింటాళ్ల సీడ్స్​సిద్ధం చేసిన వర్సిటీ
  •     అందుబాటులో 16 పంటలకు సంబంధించిన 67 రకాల సీడ్స్
  •     తెలంగాణ సోనా సహా 27 రకాల వరి విత్తనాలు
  •     మొక్కజొన్న, జొన్న, కంది విత్తనాలు కూడా
  •     రేపటి నుంచి ప్రత్యేక సెంటర్లలో విక్రయాలు

హైదరాబాద్, వెలుగు: రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఇందుకు గాను 16 పంటలకు సంబంధించిన 67 రకాల విత్తనాలను సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12 వేల క్వింటాళ్ల విత్తనాలను రైతులకు పంపిణీ చేయనుంది. అగ్రికల్చర్​వర్సిటీతో పాటు ఇండియన్​ అగ్రికల్చర్ ​రీసెర్చ్​ కౌన్సిల్​ అనుబంధ సంస్థలు ఐఐఓఆర్, ఐఐఎంఆర్, ఐఐఆర్ఆర్, హార్టీకల్చర్, వెటర్నరీ వర్సిటీలు, అగ్రికల్చర్, హార్టీకల్చర్​ డిపార్ట్​మెంట్ల అనుబంధ విభాగాలు విత్తన అభివృద్ధి సంస్థ, ఎన్ఎస్సీ, సీడ్​ఆర్గనైజేషన్​సర్టిఫికెట్​అథారిటీలు ఈ సీడ్​విక్రయాల్లో పాల్గొంటున్నాయి. 

శుక్రవారం ఉదయం 10 గంటలకు రాజేంద్రనగర్ లోని అగ్రికల్చర్​ వర్సిటీ ఆడిటోరియంలో అమ్మకాలను ప్రారంభించనున్నారు. అదే విధంగా యూనివర్సిటీ పరిధిలోని జగిత్యాల, పాలెం, వరంగల్ రీజనల్​అగ్రికల్చర్​రీసెర్చ్​ స్టేషన్లు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో కూడా విత్తనాలను అందుబాటులోకి తెస్తున్నారు. విత్తనాలతో పాటు వర్సిటీ రూపొందించిన బయో పెస్టిసైడ్స్​(జీవ ఎరువులు), చీడ పీడల నివారణలో వాడే పరాన్న జీవులు రైతుల కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. ఈ సీడ్ మేళా సందర్భంగా అగ్రికల్చర్​లో కొత్త టెక్నాలజీపై రైతులకు అవగాహన కల్పించేందుకు సెంటిస్ట్​లతో చర్చలు, ఇంటరాక్షన్​లు, అగ్రికల్చర్​ ఎగ్జిబిషన్ కూడా నిర్వహిస్తున్నారు. 

అగ్రికల్చర్​ వర్సిటీ విక్రయించే విత్తనాలు ఇవే..

సన్నాలు (19 రకాలు): బీపీటీ 5204, డబ్ల్యూజీఎల్- 44, డబ్ల్యూజీఎల్ -962, డబ్ల్యూజీఎల్ 1119, డబ్ల్యూజీఎల్ 1246, డబ్ల్యూజీఎల్ 1487, ఆర్​డీఆర్​1162, ఆర్​డీఆర్​1200, కేఎన్​ఎం1638, కేపీఎస్​ 6251, జేజీఎల్​- 28545,  జేజీఎల్​-27356, జేజీఎల్​- 33124, ఆర్ఎన్ఆర్ 15435, ఆర్ఎన్ఆర్- 2465, ఆర్ఎన్ఆర్- 11718, ఆర్ఎన్ఆర్ 21278, ఆర్ఎన్ఆర్29325, ఆర్ఎన్ఆర్ 15048

దొడ్డు వడ్లు (8 రకాలు): ఆర్ఎన్ఆర్- 28361, ఆర్ఎన్ఆర్- 15459, కేఎన్​ఎం118, ఎంటీయూ 1010, డబ్ల్యూజీఎల్- 915, జేజీఎల్​-24423, జేజీఎల్​- 28639,  సువాసన కలిగిన రకం (1) ఆర్ఎన్ఆర్ -2465

మొక్కజొన్న (5 హైబ్రీడ్ రకాలు): డీహెచ్​ఎం117, డీహెచ్​ఎం121, బీపీసీహెచ్​6, కరీంనగర్ మక్క, కరీంనగర్ మక్క-1
జొన్న (2 రకాలు): పీవైపీఎస్​-2, సీఎస్​వీ-41
రాగులు:  పీఆర్​ఎస్​ 38
ఆముదం: పీసీహెచ్​ 111
నువ్వులు: జేజీఎస్​-1020
వేరుశనగ: ధరణి 
పెసర (4 రకాలు): డబ్ల్యూజీజీ 42, ఎంజీజీ 295, ఎంజీజీ347, ఎంజీజీ 385
మినుములు: ఎంబీజీ 1070
కంది (8 రకాలు): హనుమ, డబ్ల్యూఆర్​జీఇ  97, డబ్ల్యుఆర్​జీఇ 93, డబ్ల్యుఆర్​జీఇ  121, డబ్ల్యుఆర్​జీఇ  255, పీఆర్​జీ-176, టీడీఆర్​జీ-59 
ఆశ సోయా చిక్కుడు (4 రకాలు): బాసర, కేడీఎస్​ -726, ఎంఏయూఎస్​-612, 
ఏఐఎస్​బీ-50. 
వీటితోపాటు పశుగ్రాసం పంటల విత్తనాలు కూడా విక్రయానికి సిద్ధం చేశారు.