టేస్ట్ అదరాలి : హైదరాబాద్ హైటెక్ సిటీలో కోహ్లీ రెస్టారెంట్

టేస్ట్ అదరాలి : హైదరాబాద్ హైటెక్ సిటీలో కోహ్లీ రెస్టారెంట్

స్టార్ క్రికెటర్ కోహ్లీ క్రికెట్ లోనే కాదు.. బిజినెస్ లో  కూడా దూసుకుపోతున్నాడు. విరాట్ కోహ్లీ వన్ 8 కమ్యూన్ పేరుతో రెస్టారెంట్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే బెంగళూరు, ముంబయి, పుణే, కోల్ కతా,ఢిల్లీలో రెస్టారెంట్ పెట్టిన కోహ్లీ ఇపుడు మన హైదరాబాద్ లో రెస్టారెంట్ ఓపెన్ చేశాడు.

హైటెక్ సిటీలోని హార్డ్ రాక్ కేఫ్‌కు సమీపంలో ఉన్న నాలెడ్జ్ సిటీలోని RMZ ది లాఫ్ట్‌లో ఈ రెస్టారెంట్ ను మే 24న ప్రారంభిస్తున్నట్లు కోహ్లీ తన ఇన్ స్టాలో వెల్లడించారు. మీతో కొన్ని కొత్త విషయాలను షేర్ చేసుకోవడానికి సంతోషిస్తున్నాను. మేము ఇప్పటికే హైదరాబాదద్ హైటెక్ సిటీ నడిబొడ్డుకు వచ్చేశాం..  నాకు, one8 కమ్యూన్ అనేది కేవలం ఒక రెస్టారెంట్ మాత్రమే కాదు . ఇది హైదరాబాద్‌లోనే ప్రజలను ఒకేచోటకు చేర్చడం మా ముఖ్య ఉద్దేశం అని అన్నారు.  

 ఇప్పటికే ఈ రెస్టారెంట్ ను చూడటానికి  చాలా మంది వస్తున్నారు.  మొదటగా బెంగళూరులో వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్ ను స్టార్ట్ చేశాం..ఇపుడు హైదరాబాద్ లో స్టార్ట్ చేశామని  కోహ్లీ బిజినెస్ పార్ట్ నర్  వర్తిక్ తిహార్ చెప్పాడు. కోహ్లీకి హైదరాబాద్ అంటే ఇష్టమని..ఇటీవలే ఆర్సీబీ తరపున మ్యాచులు ఆడాడాని..  వీలైతే మరి కొన్ని రోజుల్లో మరో రెస్టారెంట్ ఓపెన్ చేస్తాడని తెలిపారు.

 వన్ 8కమ్యూన్ లో గ్లోబల్ మెనూతో పాటు 20 రకాల లోకల్ రుచులతో మెనూ పెట్టామని చెప్పారు.ప్రత్యేకంగా హైదరాబాద్ బిర్యాని ఉంటుందన్నారు.కోహ్లీకి ఇష్టమైన  మష్రూమ్ డిమ్ సమ్ అతడికి ఇష్టమని అన్నారు. విరాట్ రెస్టారెంట్ ను చూసేందుకు ఫ్యాన్స్  సిద్ధమవుతున్నారు.