పాపం పసిపాప: తోటికోడలి బిడ్డకు పాయిజన్ ఇచ్చిన మహిళ..రాజస్థాన్ లో ఘటన

పాపం పసిపాప: తోటికోడలి బిడ్డకు పాయిజన్ ఇచ్చిన మహిళ..రాజస్థాన్ లో ఘటన

ఓ షాకింగ్ వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ఈవీడియోను  రాజస్థాన్ కు  చెందిన NCM ఇండియా కౌన్సిల్ ఫర్ మెన్ ఎఫైర్స్ పోస్ట్ చేసింది. ఈ వీడియోలో బెడ్ రూంలోకి ప్రవేశించి నిద్రిస్తున్నచిన్నారి నోట్లో విషంగా భావిస్తున్న ఏవో డ్రాప్స్ వేస్తున్నట్లు కనిపిస్తుంది. మహిళ  చిన్నారికి పాయిజన్ ఫీడ్ చేసి పారిపోతున్న దృశ్యాలు సీసీటీవీఫుటేజ్ లో కనిపిస్తున్నాయి. 

అసలేంజరిగిందంటే.. 

తోటి కోడలు బిడ్డకు ఓ మహిళ విషమిచ్చి చంపేందుకు యత్నించిన ఘటన రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలో జరిగింది.పెద్ద కోడలైన మహిళ తన తోటి కోడలి బిడ్డకు గుర్తుతెలియని విషమివ్వడంతో ఆ చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.  ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..గతంలో ఇదే మహిళకు చెందిన ఇద్దరు చిన్నారులకు చిన్న కోడలు పాయిజన్ ఇవ్వడం వల్లే చనిపోయినట్లు అనుమానాలున్నాయి. ప్రతీకారంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 

చిన్నారి సేఫ్ 

గతంలో ఇదే తరహాలో ఆ కుటుంబంలో ఇద్దరు చిన్నారులు మృతిచెందినట్లు చెబుతోంది. చిన్నారుల మృతి విషయంలో పెద్దకోడలైన జెథానిపై అనుమానం ఉండటంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో ఆమె ఘాతుకం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలను రాజస్థాన్ కు  చెందిన NCM ఇండియా కౌన్సిల్ ఫర్ మెన్ ఎఫైర్స్ పోస్ట్ చేసింది. అయితే ఈ ఘటనలో చిన్నారి సేఫ్ గా బయటపడింది. మూడు రోజుల పాటు ఐసీయూ చికిత్స అనంతరం కోలుకుంటోంది. 

ఏదీ ఏమైనా ఇలాంటి చర్యలు క్షమించరానివని.. నిందితురాలిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు.