ప్రజల ప్రాణాలతో చెలగాటం.. నకిలీ వైద్యుల కేంద్రాల్లో తనిఖీలు

 ప్రజల ప్రాణాలతో చెలగాటం.. నకిలీ వైద్యుల కేంద్రాల్లో తనిఖీలు

హైదరాబాద్:  అర్హత లేకున్నా వైద్యం అందిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నకిలీ వైద్యుల కేంద్రాలను మే 23వ తేదీ గురువారం తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి సభ్యులు తనిఖీ చేశారు. ఎనిమిది మంది సభ్యులు వేరు వేరు బృందాలుగా ఏర్పడి.. ఐడీపీఎల్, చింతల్, షాపూర్ ప్రాంతాలలోని పలు కేంద్రాలల్లో  ఒకేసారి తనిఖీలు జరిపారు. 

తనిఖీలలో రోగులను అడ్మిట్ చేసి ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్ ఇస్తున్న వాళ్ళు కనిపించారని.. ఎన్నో రకాల శాస్త్ర పరికరాలు లభించాయి అని వైద్య మండలి సభ్యులు తెలిపారు. తమకు తాము వైద్యులుగా పేర్కొంటూ బోర్డు పెట్టుకోవడమే కాక, వారికి అనుసంధానంగా మెడికల్ షాపులు, డయాగ్నొస్టిక్ సెంటర్లు కూడా పెట్టుకున్నారని తెలిపారు. ప్రజలు ఇలాంటి అర్హత లేని వారి వద్ద వైద్యం చేయించుకొని, తన ప్రాణాలను ప్రమాదంలో పెట్టకోవద్దని సూచించారు.

తమ తనిఖీ నివేదికను మండలికి, అలాగే జిల్లా వైద్యాధికారికి అందించి, నకిలీ వైద్యుల కేంద్రాలను మూతబడేలా చేస్తామని చెప్పారు.  నకిలీ వైద్యులపై తప్పకుండా ఎఫ్ఐఆర్ నమోదు అయ్యేలా చేస్తామని తెలిపారు.