బంగ్లాదేశ్ ఎంపీ హత్యకు 5 కోట్ల సుపారీ

బంగ్లాదేశ్ ఎంపీ హత్యకు 5 కోట్ల సుపారీ

కోల్‌క‌తాలో బంగ్లాదేశ్‌ ఎంపీ అన్వరుల్ అజిమ్ అనార్‌ హ‌త్య కలకలం స్పష్టించిన విషయం తెలిసిందే. చికిత్స కోసం భారత్ కు వచ్చిన అన్వరుల్.. కోల్‌కతా శివార్లలోని న్యూ టౌన్‌లోని అపార్ట్‌మెంట్‌లో చనిపోయి కనిపించాడు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎంపీ అన్వరుల్‌ను చంపేందుకు అత‌ని మిత్రుడే అయిదు కోట్లు ఇచ్చిన‌ట్లు ప‌శ్చిమ బెంగాల్ సీఐడీ తెలిపింది.

ప‌క్కా ప్లాన్ ప్రకార‌మే మ‌ర్డర్ జరిగిందని వెల్లడించింది. దీని కోసం భారీ మొత్తంలో డ‌బ్బు చేతులు మారింద‌ని తెలిపింది. ఎంపీని చంపేందుకు అమెరికా జాతీయుడైన అత‌ని పాత మిత్రుడే అయిదు కోట్లు ఇచ్చిన‌ట్లు వివరించింది. అత‌నికి కోల్‌క‌తాలో కూడా ఫ్లాట్ ఉందని పేర్కొంది.అన్వ‌రుల్‌ను హ‌త్య చేసిన‌ట్లు త‌మ వ‌ద్ద ఆధారాలు ఉన్నాయ‌ని సీఐడీ ఐజీ అఖిలేశ్ చ‌తుర్వేది తెలిపారు.