ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. ఏడుగురు మావోలు హతం

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. ఏడుగురు మావోలు హతం

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగుతున్న ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోలు మృతి చెందారు. మే 23వ తేదీ గురువారం ఐటీబీపీ, ఎస్ టీఎఫ్, డీఆర్ జీ, బస్తర్ బెటాలియన్‌ బలగాలు.. నారాయణపూర్, బీజాపూర్, దంతేవాడ జిల్లాల స్థానిక పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించి నక్సలైట్ల స్థావరంపై దాడి చేశారు. 

ఈక్రమంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఏడుగురు నక్సలైట్లు మృతి చెందినట్లు పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదరుకాల్పులు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. ఈ ఎన్ కౌంటర్ సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.