SRH vs RR: రాజస్థాన్‌తో క్వాలిఫయర్ 2.. సన్ రైజర్స్ జట్టులో గ్లెన్ ఫిలిప్స్

SRH vs RR: రాజస్థాన్‌తో క్వాలిఫయర్ 2.. సన్ రైజర్స్ జట్టులో గ్లెన్ ఫిలిప్స్

ఐపీఎల్ లో భాగంగా శుక్రవారం (మే 24) క్వాలిఫయర్ 2 జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. ఇప్పటికే కోల్ కతా నైట్ రైడర్స్ ఫైనల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. క్వాలిఫయర్ 1 లో కేకేఆర్ సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తు చేసి ఫైనల్లో అడుగుపెట్టింది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఎలిమినేటర్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ పై విజయం సాధించి క్వాలిఫయర్ 2లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్ తుది జట్టును ఒకసారి పరిశీలిస్తే.. 

గ్లెన్ ఫిలిప్స్ కు ఛాన్స్ ఇస్తారా..?

విదేశీ ప్లేయర్ల కోటాలో ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసన్ కమ్మిన్స్ తుది జయూయూలో ఉండడం ఖాయం. అయితే జట్టులో మరో విదేశీ ఆటగాడు విజయకాంత్ మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాడు. అడపాదడపా బౌలింగ్ మినహాయిస్తే మ్యాచ్ ను మలుపు తిప్పే స్పెల్ వేయడం లేదు. దీంతో క్వాలిఫయర్ 2 లో విజయకాంత్ స్థానంలో న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ కు అవకాశం రావొచ్చు. ఫిలిప్స్ అంతర్జాతీయ క్రికెట్ లో అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. గతేడాది సన్ రైజర్స్ తరపున మెరుపులు మెరిపించాడు. ఈ కారణంగానే అతనికి తుది జట్టులో అవకాశం దక్కొచ్చు. 

క్వాలిఫయర్ 1 లో కోల్ కతా చేతిలో ఓడిపోయిన తర్వాత వియస్కాంత్‌ స్థానంలో గ్లెన్‌ ఫిలిప్స్‌ను టీమ్‌లోకి తీసుకోవాల్సిందని, అనవసరంగా వియస్కాంత్‌ను ఆడించారని ఫ్యాన్స్ అంటున్నారు. గ్లెన్‌ ఫిలిప్స్‌ లాంటి స్టార్‌ ప్లేయర్‌ అందుబాటులో ఉన్నా.. కమిన్స్‌ అతన్ని బెంచ్‌కే పరిమితం చేసాడని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్క మార్పు మినహా సన్ రైజర్స్ జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. మరోవైపు రాజస్థాన్ ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు (అంచనా ):

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ , టి నటరాజన్, విజయకాంత్ వియాస్కాంత్/గ్లెన్ ఫిలిప్స్ 

రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు (అంచనా):

యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్ , అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్ .