సూపర్ ఐడియా : ఐటీ (టెక్) పార్కుల్లో లిక్కర్ ఔట్ లెట్స్ కు సర్కార్ గ్రీన్ సిగ్నల్

సూపర్ ఐడియా  : ఐటీ (టెక్) పార్కుల్లో లిక్కర్ ఔట్ లెట్స్ కు సర్కార్ గ్రీన్ సిగ్నల్

తిరువనంతపురం: రాష్ట్రంలోని ఐటీ పార్కుల్లో లిక్కర్ అమ్మేందుకు కేరళ ప్రభుత్వం సిద్దమవుతోంది. ఈ మేరకు కేరళ ప్రభుత్వ ప్రతిపాదనను శాసనసభ సబ్జెక్ట్ కమిటీ ఆమోదించింది. ఈ లిక్కర్ పాలసీ ప్రకారం.. FL4C పేరుతో కొత్త లైసున్సులను జారీ చేయనున్నారు. ప్రభుత్వం లేదా దాని నియంత్రణలో ఐటీ పార్కుల్లో లిక్కర్ అవుట్ లెట్ లు ఏర్పాటు చేయనున్నారు. ఇవి ప్రైవేట్ క్లబ్ మోడల్ లో పనిచేస్తాయి. లైసెన్స్ ఫీజు రూ. 20లక్షలు వసూలు చేయనున్నారు. అవుట్ లెట్ నిర్వహణను ప్రాజెక్టుడెవలపర్ లేదా కో డెవలపర్లు నిర్వహిస్తారు. 

కేరళ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను ఎలాంటి మార్పులు లేకుండానే శాసనసభ సబ్జెక్ట్ కమిటి ఆమోదించింది. ఎన్నికల కోడ్ ముగిసన తర్వాత ఐటీ పార్కుల్లో లిక్కర్ అమ్మకాలు అమలు కానున్నాయి. అయితే సబ్జెక్టు కమిటీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లిక్కర్ అమ్మకాల అనుమతిని వ్యతిరేకించారు. 
టెక్నోపార్క్ ప్రాజెక్టు డెవలపర్ గా, కంపెనీలు దాని కో డెవలపర్లుగా ఈ అవుట్ లెట్ లు పనిచేయనున్నాయి. బార్ రెస్టారెంట్లు తరహాలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పనిచేయనున్నాయి.