Good Health: ఈ ఆకులు తిన్నారా.. మోకాళ్ల నొప్పులు మాయం...

Good Health: ఈ ఆకులు తిన్నారా.. మోకాళ్ల నొప్పులు మాయం...

హైటెక్​ యుగంలో జనాలు నానా రకాల రోగాలతో ఇబ్బంది పడుతున్నారు.  మూడు పదులు వయస్సు రాకముందే మోకాళ్లనొప్పులతో బాధపడే వారు ఎందరో ఉన్నారు.  శరీరంలో యూరిక్​ యాసిడ్​ పరిమితికి మించితే మోకాళ్ల నొప్పులతో అడుగు తీసి అడుగు వేయలేరు.  అయితే ఆయుర్వేద నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఇంట్లో లభించే కొన్ని ఆకులను తింటే యూరిక్​ యాసిడ్​ సమస్యను తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.  ఇప్పుడు ఆకుల గురించి తెలుసుకుందాం. . . .

యూరిక్ యాసిడ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుత కాలంలో అందరూ ఇబ్బంది పడ్డే సమస్యల్లో ఇది కూడా ఒకటి. చాలా మంది ప్రస్తుతం ఈ సమస్యతో బాధ పడుతున్నారు. యూరిక్ యాసిడ్ లక్షణాలు తెలీక.. ఈ వ్యాధి ముదిరేంత వరకూ చూస్తున్నారు. యూరిక్ యాసిడ్ వల్ల కిడ్నీలపై కూడా ప్రమాదం పడే అవకాశాలు ఉన్నాయి. శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువ అవడం వల్ల ఈ సమస్య వస్తుంది. కిడ్నీలు సరిగా ఫిల్టర్ చేయని కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. దీంతో ఈ యూరిక్ యాసిడ్ శరీరంలోనే ఉండిపోతుంది. దీని వలన అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. నడుము, పొత్తి కడపులో నొప్పి, మోకాళ్ల నొప్పులు, జ్వరం, మూత్ర విసర్జనలో ఇబ్బందులు.. ఇవే యూరిక్ యాసిడ్ ముఖ్య లక్షణాలు. అయితే యూరిక్ యాసిడ్ సమస్యను ఇంట్లోనే.. తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

తులసి చెట్టు:తులసి అనేది ప్రతీ ఒక్కరి ఇంట్లో కూడా అందుబాటులో ఉంటుంది. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. మీలో యూరిక్ యాసిడ్ సమస్య లక్షణాలు కనిపిస్తే.. తులసి ఆకుల్ని తీసుకోవడం ద్వారా చెక్ పెట్టొచ్చు. తులసి ఆకుల్ని తరచూ నమిలి తిన్నా లేక తులసి ఆకులు వేసి మరిగించిన నీటిని తాగినా చాలా మంచి ఫలితం ఉంటుంది. వీటి వల్ల సీజనల్ వ్యాధులు కూడా దరి చేరకుండా ఉంటాయి.

వేపాకులు:వేపాకుల్లో కూడా మెడిసిన్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని పూర్వం నుంచి వివిధ రకాల అనారోగ్య సమస్యల్ని తగ్గించడానికి ఉపయోగిస్తున్నారు. మీలో కనుక యూరిక్ యాసిడ్ లక్షణాలు కనిపిస్తే.. వేప ఆకులతో కూడా తగ్గించుకోవచ్చు. ఇవి రక్తాన్ని శుద్ధి చేసి.. శరీరం నుంచి విషాన్ని బయటకు పంపిస్తాయి. యూరిక్ యాసిడ్ సమస్యతో బాధ పడేవారు ప్రతి రోజూ వేపాకుల రసం తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.

కొత్తిమీర: ఇది  మనకు అందుబాటులో ఉండే ఆకులే. కొత్తిమీరతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యల్ని తగ్గించుకోవచ్చు. కొత్తిమీరలో ఉండే ఔషధ గుణాలు కూడా యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గించుకోవడానికి హెల్ప్ చేస్తాయి. కొత్తి మీర తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. విష పదార్థాలు కూడా బయటకు పోతాయి. కాబట్టి కొత్తి మీర రసం తాగినా.. కొత్తిమీరను నమిలి తిన్నా.. ఎలా తీసుకున్నా ఆరోగ్యానికి చాలా మంచిది