డ్రై డే లేదు.. తొక్కా లేదు : 365 రోజులూ మందు అమ్మండి.. సర్కార్ సంచలన నిర్ణయం

డ్రై డే లేదు.. తొక్కా లేదు : 365 రోజులూ మందు అమ్మండి.. సర్కార్ సంచలన నిర్ణయం

కేరళ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.  రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మద్యం అమ్మకాలు పెంచేందుకు  డ్రైడేలను రద్దు చేయాలని నిర్ణయించింది. ఆర్థిక నిపుణులతో సమావేశమైన  రాస్ట్ర చీఫ్ సెక్రటరీ వేణు ఈ మేరకు  సిఫార్సు చేశారు.  డ్రై డేలను రద్దు చేయడం వల్ల  ప్రభుత్వానికి అదనంగా రూ.15 వేల కోట్ల ఆదాయం రాబట్టొచ్చని అంచనా వేశారు. ప్రస్తుతం కేరళలోని రిటైల్ షాపులు లేదా బార్ అండ్ హోటళ్లలో ప్రతి నెలా ఒకటో తేదీన మద్యం అమ్మడం లేదు. 

కేరళలోని ప్రజలు ఒక వారం పాటు మద్యానికి దూరంగా ఉంటే.. అది ఆర్థిక విపత్తుకు దారితీస్తుందని నిపుణులు వాదిస్తున్నారు. ఎందుకంటే కేరళ సర్కార్ ఎక్కువగా మద్యం వల్ల వచ్చే ఆదాయం మీద ఆధారపడి ఉంది.   కేరళలో మద్యం అమ్మకాల ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరంలోప్రభుత్వానికి రూ.16,189.55 కోట్ల పన్నులు వస్తే...2023-24  ఆర్థిక సంవత్సరంలో  రూ.16,609.63 కోట్లు వచ్చాయి.  కేరళలో  2022-23లో రూ.18,510.98 కోట్ల మద్యం విక్రయాలు ఉంటే.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మద్యం, బీర్ల విక్రయాలు రూ.19,088.68 కోట్లకు చేరాయి.


రాష్ట్రంలోని 3.34 కోట్ల మంది జనాభాలో 29.8 లక్షల మంది పురుషులు, 3.1 లక్షల మంది మహిళలు ఉన్నారని, వారిలో దాదాపు 32.9 లక్షల మంది మద్యం సేవిస్తున్నారని కేరళలోని మద్యం వినియోగదారుల ప్రొఫైల్ వెల్లడించింది. రోజుకు దాదాపు ఐదు లక్షల మంది మద్యం సేవిస్తున్నారు. ఇందులో 1,043 మంది మహిళలు సహా 83,851 మంది మద్యానికి బానిసలు.కొనుగోలుదారులు ఎక్కువగా  రోజు పనిని ముగించే కూలీలు కాబట్టి తక్కువ ధర కలిగిన మద్యం ఉత్పత్తిని పెంచాలని మరొక సిఫార్సు చేశారు.