అలర్ట్ : బంగాళాఖాతంలో అల్పపీడనం. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు

అలర్ట్ : బంగాళాఖాతంలో అల్పపీడనం. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం కారణంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం పడనుంది. ఇవాళ పలు జిల్లాల్లో మోస్తరు నుండి కొన్ని చోట్ల భారీ వర్షాల పడే ఛాన్స్ ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. తెలంగాణ మీద ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. హైదరాబాద్ లోని కాప్రా, మల్కాజ్గిరి, ఉప్పల్, ఉస్మానియా, చంద్రాయన్ గుట్ట, ఎల్. బి. నగర్, కర్మన్ఘాట్, అబిట్స్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో తెల్లవారుజామున 2 గంటల నుండి వర్షం పడింది. 

45 నిమిషాల పాటు ఈదురు గాలులతో వర్షం కురిసింది. అల్ప పీడనంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుండి భారీ వర్షం, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం రేపు వాయుగుండంగా బలపడే అవకాశం  ఉంది. బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.

 దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో మరిన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి. జూన్ 8 నుంచి 11 మధ్య తెలంగాణాలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వర్షం ప్రభావిత ప్రాంతాల్లో నివసించే లోతట్టు ప్రాంతాల ప్రజలకు అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.