- అధికారులకు ఏసీబీ డీజీ చారు సిన్హా సూచన
హైదరాబాద్, వెలుగు: విచారణ, దర్యాప్తులో సాంకేతికత, డేటా అనలిటిక్స్‌ను వినియోగించుకోవాలని ఏసీబీ డీజీ చారుసిన్హా సూచించారు. ఏసీబీ అధికారులు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని, కేసుల డాక్యుమెంటేషన్, ఆధారాల నిర్వహణలో క్వాలిటీ మెరుగుపరుచుకోవాలన్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లో నమోదు చేసి దర్యాప్తు చేసిన కేసులలో విశేష కృషి చేసిన అధికారులు, సిబ్బందిని సత్కరించేందుకు సోమవారం బంజారాహిల్స్ లోని ఏసీబీ కేంద్ర కార్యాలయంలో ‘రివార్డ్ మేళా’ ను నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు రివార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.
గతేడాది చివరి మూడు నెలల్లో 78 కేసులు నమోదు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇలా గత పదేండ్లలో చివరి మూడు నెలల సమయంలో నమోదు చేసిన కేసులతో పోలిస్తే 2025లో ఏసీబీ అధికారులు అత్యుత్తమ పనితీరు కనబర్చడంపై సంతృప్తి వ్యక్తం చేశారు . గత 14 సంవత్సరాలలో ఇదే కాలంలో నమోదైన కేసులతో పోలిస్తే, 2025 చివరి మూడు నెలల్లోఅత్యధిక సంఖ్యలో అవినీతి కేసులు నమోదు కావడం ఒక చారిత్రక ఘట్టంగా పేర్కొన్నారు.
