ప్రముఖ వాషింగ్ మిషన్ల తయారీ కంపెనీ వర్ల్ పూల్ కొత్త రకం వాషింగ్ మెషీన్లను ప్రారంభించింది. ఓజోన్ ఎయిర్ రిఫ్రెష్ టెక్నాలజీతో ఎక్స్ పర్ట్ కేర్ కేర్ వాషింగ్ మెషీన్లను విడుదల చేసింది. ఇది నీటితో కాకుండా గాలితోనే బట్టను శుభ్రం చేస్తుంది. నీళ్లు, డిటర్జెంట్ లేకుండానే ఓజోన్ వాయువు ద్వారా దుస్తులను వాష్ చేస్తాయి.
నీటితో అవసరం లేకుండా బట్టల ఉతకడం కోసం ఓజోన్ ఎయిర్ రిఫ్రెష్ టెక్నాలజీ ఉంటుంది. ఆక్సిజన్ ను ఓజోన్ గా మార్చడం ద్వారా దుస్తులను శానిటైజ్ చేయడం, చెడువాసన తొలగించడం, వందశాతం బ్యాక్టీరియా, అలెర్జీ కారకాలను తొలగిస్తుంది. దీంతోపాటు బట్టలకు ఎటువంటి డ్యామేజీ లేకుండా శుభ్రం చేస్తుంది.
బ్లేజర్లు, చీరలు, ఆఫీస్ దుస్తులు వంటి తేలిక బట్టలకు ఇది బెస్ట్ వన్ అని వర్ల్ పూల్ కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. కఠిన మైన మరకలను కూడా తొలగిస్తుందంటున్నారు. ఈ శ్రేణిలో స్టీమ్ వాష్, సిక్త్స్ సెన్స్ టెక్నాలజీ , ఫాబ్రిక్ సంరక్షణ కోసం ఫ్రెష్ కేర్+ వంటి ఆప్షన్లు కూడా ఉన్నాయి.
