హ్యాట్రిక్ పై కన్నేసిన సన్ రైజర్స్

హ్యాట్రిక్ పై కన్నేసిన సన్ రైజర్స్

షార్జా/ దుబాయ్‌‌‌‌: ఐపీఎల్‌‌‌‌ ఫ్యాన్స్‌‌‌‌ కోసం ఆదివారం  మరో డబుల్‌‌‌‌ బొనాంజా సిద్ధమైంది.హ్యాట్రిక్ విక్టరీపై కన్నేసిన సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ మరో పోరుకు రెడీ అయ్యింది.  నేడు ముంబై ఇండియన్స్‌‌‌‌తో తలపడనుంది. ఇరుజట్లలో విధ్వంసకర బ్యాట్స్‌‌‌‌మెన్‌‌‌‌ ఉండడంతో  ఈ మ్యాచ్‌‌‌‌లో భారీ స్కోర్లు రికార్డు అయ్యే సూచనలున్నాయి.  గత మ్యాచ్‌‌‌‌లో చెన్నైపై స్వల్ప తేడాతో నెగ్గిన సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌.. అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. కానీ పేసర్‌‌‌‌ భువనేశ్వర్‌‌‌‌ అందుబాటుపై సస్పెన్స్‌‌‌‌ కొనసాగుతున్నది. వరుసగా విఫలమవుతున్న కెప్టెన్‌‌‌‌ వార్నర్‌‌‌‌, బెయిర్‌‌‌‌స్టో, మనీశ్‌‌‌‌ పాండే రాణించడం కీలకం. ‌‌‌‌విలియమ్సన్‌‌‌‌ జట్టుకు మూల స్తంభం కాగా, అభిషేక్‌‌‌‌ శర్మ, ప్రియమ్‌‌‌‌గార్గ్‌‌‌‌ చెన్నైపై ఆడిన ఇన్నింగ్స్‌‌‌‌తో జట్టు కాన్ఫిడెన్స్‌‌‌‌ పెరిగింది. ఒకవేళ భువీ దూరమైతే థంపి, సిద్ధార్ద్‌‌‌‌ కౌల్‌‌‌‌, సందీప్‌‌‌‌ శర్మలో ఒకరికి ఫైనల్‌‌‌‌ ఎలెవెన్‌‌‌‌లో అవకాశం దొరుకుతుంది. మరోపక్క ఆడిన నాలుగు మ్యాచ్‌‌‌‌ల్లో రెండు విజయాలు సాధించిన ముంబై  ఫుల్‌‌‌‌ జోష్‌‌‌‌లో ఉంది. పంజాబ్‌‌‌‌తో జరిగిన తమ లాస్ట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో  కెప్టెన్‌‌‌‌ రోహిత్‌‌‌‌ శర్మతోపాటు హార్దిక్‌‌‌‌ పాండ్యా టచ్‌‌‌‌లోకి రావడంతో జట్టు కాన్ఫిడెన్స్‌‌‌‌ అమాంతం పెరిగిపోయింది. పొలార్డ్‌‌‌‌, ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ మంచి ఫామ్‌‌‌‌లో ఉండగా.. క్వింటన్‌‌‌‌ డికాక్‌‌‌‌ వరుసగా ఫెయిలవుతుండడం ముంబైని ఇబ్బంది పెడుతోంది. బౌలింగ్‌‌‌‌లో ముంబైకి సమస్యల్లేవు.

ఒత్తిడిలో చెన్నై..

గతంలో ఎప్పుడు లేని విధంగా చెన్నై హ్యాట్రిక్‌‌‌‌ ఓటములతో పాయింట్ల టేబుల్‌‌‌‌లో ప్రస్తుతం అట్టడుగు స్థానంలో ఉంది. దీంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న చెన్నై.. పంజాబ్​తో మరో పోరుకు రెడీ అయ్యింది.  గత రెండు మ్యాచ్‌‌‌‌ల్లో ఓడిన పంజాబ్‌‌‌‌.. సీఎస్‌‌‌‌కేకు షాకిచ్చి గెలుపు బాట పట్టాలని భావిస్తోంది. లైనప్స్‌‌‌‌ పరంగా రెండు టీమ్స్‌‌‌‌ బలంగానే ఉన్నా.. ఫామ్‌‌‌‌ పరంగా సీఎస్‌‌‌‌కే కాస్త వెనుకంజలో ఉంది. ఈ సీజన్‌‌‌‌లో చెన్నై వేసిన ప్లాన్స్‌‌‌‌ అన్నీ  బెడిసికొట్టాయి. సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌తో జరిగిన మ్యాచ్‌‌‌‌లో జట్టులో మూడు మార్పులతో బరిలోకి దిగినా ఆశించిన రిజల్ట్‌‌‌‌ లభించలేదు. ముఖ్యంగా టాపార్డర్‌‌‌‌ వైఫల్యం సీఎస్‌‌‌‌కేను దెబ్బతీస్తుంది. బ్యాటింగ్‌‌‌‌తోపాటు బౌలింగ్‌‌‌‌, ఫీల్డింగ్‌‌‌‌ల్లో కూడా  చెన్నై మెరుగుపడాల్సి ఉంది. మరోపక్క పంజాబ్‌‌‌‌ జట్టు అన్ని ఏరియాల్లో బలంగా కనిపిస్తోంది. కెప్టెన్‌‌‌‌ రాహుల్‌‌‌‌, మయాంక్ అగర్వాల్‌‌‌‌ టాప్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉన్నారు. 200కు పైగా స్కోర్లు వస్తున్నా బౌలింగ్‌‌‌‌ వైఫ్యలంతో వాటిని కాపాడుకోలేకపోతున్నారు. మహ్మద్‌‌‌‌ షమీకి తగిన సహకారం ఇచ్చే బౌలర్‌‌‌‌ కరువయ్యారు. బౌలర్లు రాణించడంపైనే  పంజాబ్‌‌‌‌ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.