గెలిచి ప్లే ఆఫ్స్‌‌కు వెళ్తుందా?..ఓడి కోల్‌ కతాకు దారిస్తుందా?

గెలిచి ప్లే ఆఫ్స్‌‌కు వెళ్తుందా?..ఓడి కోల్‌ కతాకు దారిస్తుందా?
  • నేడు ముంబైతో పోరు
  • గెలిస్తే ప్లే ఆఫ్స్‌ కు హైదరాబాద్
  • ఓడితే కోల్‌ కతాకు నాలుగో బెర్త్‌‌ 

షార్జా: ముంబై ఇండియన్స్‌‌ అందరికంటే ముందే ఫ్లే ఆఫ్‌‌ బెర్తు దక్కించుకుంది. సోమవారం ఆర్‌‌సీబీపై విక్టరీతో  పాయింట్స్‌‌ టేబుల్‌‌లో సెకండ్‌‌ ప్లేస్‌‌తో ఢిల్లీ (16 పాయింట్స్‌‌) కూడా క్వాలిఫయర్‌‌–1కు అర్హత సాధించింది. ఢిల్లీ చేతిలో ఓడిన ఆర్‌‌సీబీ, కోల్‌‌కతా చెరో 14 పాయింట్లతో నిలిచాయి. కానీ, కాస్త మెరుగైన రన్‌‌రేట్‌‌తో బెంగళూరు కూడా థర్డ్‌‌ ప్లేస్‌‌తో ప్లే ఆఫ్స్‌‌కు క్వాలిఫై అయింది. నాలుగో బెర్త్‌‌ కోసం సన్‌‌ రైజర్స్‌‌ మంగళవారం జరిగే ఆఖరి లీగ్‌‌ మ్యాచ్‌‌లో  టేబుల్‌‌ టాపర్‌‌ ముంబైతో అమీతుమీ తేల్చుకోనుంది. ప్రస్తుతం రైజర్స్​కు +0.555 రన్‌‌రేట్‌‌తో 12 పాయింట్లున్నాయి. కాబట్టి ముంబైపై గెలిస్తే  వార్నర్‌‌సేన మూడో ప్లేస్‌‌కు ఎగబాకి ప్లే ఆఫ్స్‌‌కు అర్హత సాధిస్తుంది. అప్పుడు ఆర్‌‌సీబీ (-–0.172) ఫోర్త్‌‌ ప్లేస్‌‌కు రానుండగా.. కోల్‌‌కతా (-–0.214) ఐదో ప్లేస్‌‌కు పడిపోయి టోర్నీ నుంచి ఎలిమినేట్‌‌ అవుతుంది. ఒకవేళ రైజర్స్‌‌ ఓడితే మాత్రం కోల్‌‌కతా తన నాలుగో ప్లేస్‌‌ను నిలబెట్టుకొని లాస్ట్‌‌ బెర్త్‌‌ దక్కించుకోనుంది.  అయితే, కేకేఆర్‌‌కు ఆ చాన్స్‌‌ ఇవ్వకూడదని హైదరాబాద్‌‌ భావిస్తోంది. గత రెండు మ్యాచ్‌‌ల్లో ఢిల్లీ, బెంగళూరును ఓడించి  కాన్ఫిడెన్స్‌‌ పెంచుకున్న వార్నర్‌‌సేన అదే జోష్‌‌తో ముంబై పని పట్టాలని చూస్తోంది. అనేక ఇబ్బందుల తర్వాత చివరి దశలో రైజర్స్‌‌ టీమ్‌‌లో బ్యాలెన్స్‌‌ వచ్చింది. జానీ బెయిర్‌‌స్టోను పక్కనపెట్టాలన్న కీలక నిర్ణయం రైజర్స్‌‌ రాత మార్చిందని చెప్పొచ్చు. జానీ ప్లేస్‌‌లో ఓపెనర్‌‌గా వచ్చిన వృద్ధిమాన్‌‌ సాహా లాస్ట్‌‌ రెండు మ్యాచ్‌‌ల్లో అదరగొట్టగా.. ఖాళీ అయిన ఫారినర్‌‌ కోటాలో ఆల్‌‌రౌండర్‌‌ జేసన్‌‌ హోల్డర్‌‌ రాకతో జట్టు బలం రెట్టింపైంది. బెంగళూరుపై హోల్డర్‌‌, సందీప్‌‌ శర్మ అద్భుతంగా బౌలింగ్‌‌ చేశారు.  వీరికితోడు లెఫ్టార్మ్‌‌ పేసర్‌‌ నటరాజన్‌‌, ట్రంప్‌‌ కార్డ్‌‌ రషీద్‌‌ ఖాన్‌‌ కూడా సత్తా చాటడంతో హైదరాబాద్‌‌ ప్లే ఆఫ్స్​ రేసులో నిలిచింది. వార్నర్‌‌, పాండే కూడా ఫామ్‌‌లో ఉన్నారు. కాబట్టి  మరోసారి ఆల్‌‌రౌండ్‌‌ పెర్ఫామెన్స్‌‌ చేస్తే రైజర్స్‌‌ ముందంజ వేయగలదు. అయితే, ముంబైలాంటి టఫ్‌‌ అపొనెంట్‌‌పై  ఏ చిన్న మిస్టేక్‌‌ చేసినా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వార్నర్‌‌ అండ్‌‌ కో గుర్తుంచుకోవాలి. గాయంతో రెగ్యులర్‌‌ కెప్టెన్‌‌ రోహిత్‌‌ దూరమైనా ముంబై ఓ రేంజ్‌‌లో విజృంభిస్తోంది. స్టాండిన్‌‌ కెప్టెన్‌‌ పొలార్డ్‌‌ ఆ జట్టును సమర్థవంతంగా నడిపిస్తున్నాడు. మరి, టేబుల్‌‌ టాపర్‌‌కు చెక్‌‌ పెట్టి సన్‌‌రైజర్స్‌‌ ప్లే ఆఫ్స్‌‌కు వస్తుందా? ఓడిపోయి  కోల్‌‌కతాకు దారి వదులుతుందా? చూడాలి.