ఇద్దరు దొంగలు కలిసి మేయర్ పదవి దక్కించుకున్నారు

V6 Velugu Posted on Feb 11, 2021

TRS అసలు రూపం ఇవాళ బయట పడిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్. ఎన్నికల సమయంలో MIM కు తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన TRS ప్రజలను మోసం చేసిందన్నారు. ఇద్దరు దొంగలు కలిసి మేయర్ పదవి దక్కించుకున్నారని తెలిపారు. కౌన్సిల్ లో ఎం జరిగిందో తెలంగాణ ప్రజలు మొత్తం చూసారన్నారు. ఇద్దరు దొంగలు కలిసి మేయర్ పదవి దక్కించుకున్నారని ఆరోపించారు. TRS…MIM తో  కలిసి పోటీ చేసి ఉంటే కనీసం 15 సీట్లు కూడా వచ్చేవి కావన్నారు. తాము అభ్యర్థిని పెడతామని రెండు రోజులుగా చెబుతున్నా ఎంఐఎం.. టీఆర్ఎస్ కు ఎందుకు మద్దతు ఇచ్చిందని ప్రశ్నించారు. గతంలో ఇద్దరు కలిసి GHMCని సర్వనాశనం చేశారని తెలిపారు. ఇప్పుడు మళ్లీ అదే ప్లాన్ లో ఉన్నారన్నారు. మాకు బలం లేదని తెలిసిన పోటీ చేసామన్న రాజాసింగ్..ఇలాంటి చిల్లర పార్టీలో టీఆరెఏస్ కార్పొరేటర్లు ఉంటారా..  బయటకు వస్తారా..  ఆలోచించుకోవాలని సూచించారు.

Tagged mayor, position, raja singh, Secure, together, two thieves

Latest Videos

Subscribe Now

More News