టోక్యో: ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ టీమ్ కీలక మ్యాచ్‌లో అదరగొట్టింది. తదుపరి స్టేజ్‌కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇండియన్ విమెన్స్ ఆకట్టుకున్నారు. ఐర్లాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు హోరాహోరీగా ఆడాయి. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళలు సత్తా చాటారు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో 57వ నిమిషంలో భారత్ తరఫున నవ్‌నీత్ కౌర్ గోల్ చేసింది. మ్యాచ్ మొత్తంలో నమోదైన ఏకైక గోల్ ఇదే. ఈ ఆధిక్యాన్ని ఆఖరి వరకు కాపాడుకున్న భారత్ విజయం సాధించింది. తద్వారా క్వార్టర్ ఫైనల్లో బెర్త్ కోసం ఆశలను సజీవంగా ఉంచుకుంది. పూల్ ఏలో సౌతాఫ్రికాతో శనివారం జరిగే మ్యాచ్‌లో గెలిస్తే భారత్ క్వార్టర్స్‌కు చేరుకుటుంది.
