ప్రముఖ సినీ నిర్మాత సి.వెంకటరాజు కన్నుమూత

ప్రముఖ సినీ నిర్మాత సి.వెంకటరాజు కన్నుమూత

ప్రముఖ సినీ నిర్మాత సి.వెంకటరాజు(72) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.  గీత చిత్ర ఇంటర్నేషనల్ పతాకంపై పవిత్రబంధం, ఘర్షణ, పెళ్లిచేసుకుందాం, శ్రీమతి వెళ్లొస్తా సహా 16 చిత్రాలకు ఆయన నిర్మాత. పలు చిత్రాలకు ప్రొడక్షన్ విభాగంలోనూ ఆయన పనిచేశారు. వెంకటరాజు మృతికి టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. రేపు చెన్నైలో వెంకటరాజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.