ఎంజాయ్ : OTTలోకి రెండు కొత్త సినిమాలు

ఎంజాయ్ : OTTలోకి రెండు కొత్త సినిమాలు

నేషనల్ అవార్డ్ విన్నర్ సంకల్ప్ రెడ్డి(Sankalp Reddy)  లేటెస్ట్ మూవీ 'IB 71' తో పాటు లవర్ బాయ్ సిద్ధార్ద్(Siddharth) టక్కర్  రేపు (జూలై 8న) ఓటీటీలోకు రానున్నాయి.  ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన  'IB 71' మూవీ బాక్సపీస్ వద్ద యావరేజ్ హిట్ గా నిలిచింది. విద్యుత్ జమ్వాల్(Vidyut Jammwal) నటించిన ఈ మూవీ డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. 

'IB 71' ఘాజీ ఫిల్మ్ కు ప్రీక్వెల్ కథగా తెరకెక్కగా.. 


ఇది 1971 నాటి గంగా హైజాక్ నేపథ్యంలో కథ సాగినట్లు ఉంటుంది. 1971 ఇండో-పాక్ యుద్ధం ఆధారంగా రూపొందించారు. 50 ఏళ్ల పాటు అత్యంత రహస్యంగా ఉంచిన ఇండియాస్  టాప్ సీక్రెట్ మిషన్ గురించి ‘IB71’లో చూపించారు .  ఈ ఫిల్మ్ సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 

సిద్ధార్ద్ టక్కర్ మూవీ: 

సిద్దార్ద్, దివ్యాంశ(Divyansha Kaushik)  జోడీగా రూపొందిన టక్కర్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.  హీరో సిద్ధార్థ్‌ చాలా కాలం తర్వాత తెలుగులో సోలో హీరోగా నటించిన టక్కర్ మూవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. కథ విషయానికి వస్తే సిద్ధార్థ్‌ ఓ పేద ఇంట్లో పుట్టిన కుర్రాడిలా నటించాడు. తన జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు, అవమానాలకు పేదరికమే కారణమని బాధపడే వ్యక్తిత్వంతో నటించి..షాట్ కట్ లో ఎలాగైనా డబ్బు సంపాదించి.. కోటీశ్వరుడు అవ్వాలన్న లక్ష్యంతో ఎలా ఎదిగాడు అనేది ఈ మూవీ కథాంశం.