గ్లోబల్ వార్మింగ్.. కోట్ల చేపలు చచ్చిపోయాయి.. ఎందుకంటే..

గ్లోబల్ వార్మింగ్..  కోట్ల చేపలు చచ్చిపోయాయి.. ఎందుకంటే..

ప్రకృతిలో వచ్చిన మార్పులు జీవరాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.  ఓ బీచ్ లో వేల కొద్దీ చేపలు మరణించాయి. చేపలకు ఆక్సిజన్ అందక మరణించాయని చెబుతున్నారు. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్‌లోని గల్ఫ్ కోస్ట్ బీచ్‌లో చోటు చేసుకుంది. 

ప్రపంచంలో గ్లోబల్ వార్మింగ్ హెచ్చరికలు మొదలయ్యాయి.  అమెరికాలోని (USA) టెక్సాస్‌ (Texas) గల్ఫ్‌ కోస్ట్‌ తీరంలో గల  బ్రియాన్‌ బీచ్‌లో వేలకొద్దీ మెన్‌హడెన్‌ జాతికి చెందిన చేపలు చనిపోయి కొట్టుకొచ్చాయి.  2040 కల్లా చేపలు అంతమవుతాయని ఆస్ట్రేలియా పర్యాటక మంత్రి డాన్ ఫారెల్‌ వ్యాఖ్యలకు నిదర్శనంగా ఉంది.

ఆక్సిజన్ అందక...

నీటిలో చేపలు జీవించడానికి ఆక్సిజన్ అవసరం.. వేడి ఎక్కువైతే సహజంగా ఆక్సిజన్ తగ్గిపోతుంది. మెన్‌హేడెన్ రకానికి చెందిన చేపలు జీవించాలంటే 70 డిగ్రీల ఫారెన్‌హీట్ కంటె తక్కువ ఉష్ణోగ్రత ఉండాలి.  అంతకంటే ఉష్ణోగ్రత పెరిగితే అవి జీవించడం చాలా కష్టమవుతుంది.  టెక్సాస్ బీచ్ లో చేపలు  చనిపోయి ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. బ్రియాన్ బీచ్ లో మెన్‌హాడెన్ చేపలు చనిపోయాయని అవుట్‌లెట్ కు చెందిన స్థానిక అధికారులు చెప్పారు. ఒకేసారి ఇన్ని చేపలు చనిపోవడానికి కారణమేంటని అధికారులను అడిగితే గోరువెచ్చని నీటిలో ఆక్సిజన్ అందక చనిపోయాయని చెప్పారు. చేపలకు చల్లటి నీటిలో వాటికి తగినంత ఆక్సిజన్ లభిస్తుంది.  

నీరు వేడెక్కి...

నీటిలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు.. మెన్‌హేడెన్ చేపలు జీవించడానికి తగినంత ఆక్సిజన్‌ను పొందడం కష్టమవుతుందని తెలిపారు. మెన్‌హాడెన్ చేపలు ఎక్కువగా కెనడా నుండి దక్షిణ అమెరికా వరకు కనిపిస్తాయి. అయితే ఎండిపోతున్న సరస్సులోని నీరు.. లోతైన నీటి కంటే త్వరగా వేడెక్కుతుంది. కనుక ఈ మెన్‌హాడెన్ చేపలు తక్కువ లోతు ఉన్న సరస్సులో చిక్కుకుంటే, చేపలు హైపోక్సియాతో బాధపడతాయని అధికారులు ఫేస్‌బుక్ పోస్ట్‌లో వెల్లడించారు.

90 డిగ్రీల ఫారన్ హీట్ నమోదు

నీటి అడుగుభాగం కంటే ఉపరితల జలాలు త్వరగా వేడెక్కుతాయి. ఈ సమయంలో చేపల గుంపు అందులో చిక్కుకుంటే మొప్పల ద్వారా ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఫలితంగా ప్రాణాలు కోల్పోతున్నాయి.  ఆ రోజు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 90 డిగ్రీల ఫారన్‌హీట్‌గా నమోదైనట్లు అమెరికా జాతీయ వాతావరణ విభాగం  పేర్కొంది.

https://twitter.com/JustStop_Oil/status/1668333440943665152