హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఓపె:న్ స్కూల్ సొసైటీ (టాస్) పరిధిలో నిర్వహించే ఎస్సెస్సీ, ఇంటర్‌పబ్లిక్ పరీక్షలు ఈనెల 20 నుంచి 27 వరకు జరగనున్నాయని టాస్ డైరెక్టర్ వీపీ శ్రీహరి తెలిపారు. దీనికి సంబంధించిన హాల్ టికెట్లను రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు.
విద్యార్థులు తమ హాల్ టికెట్లను www.telanganaopenschool.org వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. వెబ్‌సైట్‌తో పాటు మీసేవ వాట్సాప్ సర్వీస్ ద్వారా కూడా హాల్ టికెట్లు పొందే సదుపాయం కల్పించారు.
