రెడ్ డైరీ కాదు..బ్లూ డైరీ ఓపెన్ చేసుకో..కేటీఆర్‌పై టూరిజం చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి ఫైర్

రెడ్ డైరీ కాదు..బ్లూ డైరీ ఓపెన్ చేసుకో..కేటీఆర్‌పై టూరిజం చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి ఫైర్

హైదరాబాద్, వెలుగు:“కేటీఆర్ రెడ్ డైరీ కాదు, అవసరమైతే బ్లూ డైరీ ఓపెన్ చేసుకో! రేవంత్ రెడ్డే మరో పదేండ్లు సీఎంగా ఉంటారు” అని టూరిజం డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి హెచ్చరించారు. సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేశ్ రెడ్డితో కలిసి శనివారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ సీఎం స్థాయిని గౌరవించకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆయన భాషను చూసి తెలంగాణ సమాజం తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని పటేల్ రమేశ్ రెడ్డి విమర్శించారు. 

డ్రగ్స్‌‌కు అలవాటుపడి, హీరోయిన్‌‌లను బ్లాక్‌‌మెయిల్ చేసిన చరిత్ర కేటీఆర్‌‌దని పైర్ అయ్యారు. అన్వేశ్ రెడ్డి మాట్లాడుతూ.. “కేటీఆర్ మరోసారి రేవంత్ రెడ్డిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే, నాలుక చీరేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. కేటీఆర్ తీవ్ర అసహనంలో ఉన్నారని, ఆయన కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు.