రాజగోపాల్ రెడ్డి ఎందుకు వెళుతున్నారో నాకు తెలుసు: ఉత్తమ్

రాజగోపాల్ రెడ్డి ఎందుకు వెళుతున్నారో నాకు తెలుసు: ఉత్తమ్

కాంగ్రెస్ ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు వ్యవహారంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. రాజకీయ కారణాలతో వెళ్లేవారికి అయితే ఏదైనా చెప్పొచ్చని, ఆర్థికపరమైన కారణాలతో వెళ్లేవారికి ఏం చెప్పగలం అని ఆయన అన్నారు. రాజగోపాల్ రెడ్డి  ఏ కారణాలతో వెళ్తున్నారో తనకు చెప్పారన్నారు ఉత్తమ్. వెళ్లాలని నిర్ణయించుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏదైనా చెబుతూ ఉండొచ్చని, అతను పార్టీ మార్పు గురించి ఏఐసిసి పెద్దలతో చర్చిస్తామన్నారు. చర్చించిన తర్వాత మరోసారి మీడియా తో మాట్లాడుతానని ఉత్తమ్ అన్నారు.