విద్యార్ధులవి ఆత్మహత్యలు కాదు..ప్రభుత్వ హత్యలు: ఉత్తమ్

విద్యార్ధులవి ఆత్మహత్యలు కాదు..ప్రభుత్వ హత్యలు: ఉత్తమ్

ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.  పరీక్షల్లో ఫెయిలైనందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్రమనోవేదన చెందుతున్నారని అన్నారు. ఫెయిలైన విద్యార్థులవి ఆత్మహత్యలు కావని, అవి ప్రభుత్వ హత్యలని అన్నారు. మనస్థాపంతో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు

పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ ప్రభుత్వం తరపున  సీఎం కేసీఆర్ విద్యార్ధులకు, వారి తల్లిదండ్రులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఉత్తమ్ అన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు మాత్రమే కాకుండా.. పరీక్ష రాసిన విద్యార్థులందరికీ ఉచితంగా రీ వాల్యుయేషన్ చేయాలని అన్నారు. విద్యాశాఖ మంత్రిజగదీష్ రెడ్డి ని బర్తరఫ్ చేయాలని, విద్యార్థులందరికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఉత్తమ్ కుమార్ అన్నారు.