
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి. ఇప్పటికే చాలా సార్లు రాహుల్ గాంధీ తన పౌరసత్వంపై క్లారిటీ ఇచ్చారని అన్నారు. నాలుగు సార్లు ఎంపీగా పోటీచేసిన ఆయన ఎన్నికల అఫిడవుట్ లో కూడా తెలిపారని అన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే రాహుల్ గాంధీ పౌరసత్వంపై బీజేపీ ఛీప్ ట్రిక్స్ ప్రయోగిస్తుందని విమర్శించారు. రాహుల్ ప్రధాని కాకుండా బీజేపీ ఇలాంటి కుట్రలు పన్నుతుందని ఆరోపించారు మల్లురవి. రాహుల్ పుట్టి పెరిగింది ఇండియాలోనే అని అన్నారు. ప్రశ్నించే వారిపై ఇలాంటి ముద్రలు వేయడం బీజేపీకి అలవాటేనని అన్నారు. దేశంలో కార్మిక హక్కుల కోసం .. సంక్షేమం కోసం కాంగ్రెస్ చిత్తశుద్ధితో పని చేస్తుందని చెప్పారు. బీజేపీ లో ఉన్నవాళ్లే భారతీయులు .. మిగతా వారు కాదన్నట్లు బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని అన్నారు.