బషీర్బాగ్, వెలుగు : తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గంధం రాములుకు రాష్ట్ర ప్రభుత్వం ‘శ్రమ శక్తి’ అవార్డు ప్రకటించిన సందర్భంగా శుక్రవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో అభినందన సభ నిర్వహించారు.
ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాత్ర కీలకమని, వీ6 చానెల్ ద్వారా ఉద్యమాన్ని ప్రపంచానికి చాటారని కొనియాడారు.
కార్మిక నాయకుడైన రాములుకు అవార్డు దక్కడంపై హర్షం వ్యక్తం చేస్తూ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం రాములు మాట్లాడుతూ.. ప్రైవేట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, మహిళలకు సమాన వేతనాలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు కరుణాకర్ రెడ్డి, ఉప్పలరావు తదితరులు పాల్గొన్నారు.
